పేదలకు ఇచ్చే ఇంటి స్థలం.. జగన్ ఇంట్లో బాత్‌రూం అంత కూడా లేదు: అచ్చెన్నాయుడు

పేదలకు ఇచ్చే ఇంటి స్థలం.. జగన్ ఇంట్లో బాత్‌రూం అంత కూడా లేదు: అచ్చెన్నాయుడు
పేదలకు ఇచ్చే ఇంటి స్థలం జగన్ ఇంట్లో బాత్‌రూం అంత కూడా లేదని విమర్శించారు టీడీపీ ఏపీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు. సెంటు భూమిలో కట్టే ఇంట్లో తనలాంటి ఎత్తు ఉన్న వాళ్లు పడుకోవడం సాధ్యం కాదని చెప్పారు.

పేదలకు ఇచ్చే ఇంటి స్థలం జగన్ ఇంట్లో బాత్‌రూం అంత కూడా లేదని విమర్శించారు టీడీపీ ఏపీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు. సెంటు భూమిలో కట్టే ఇంట్లో తనలాంటి ఎత్తు ఉన్న వాళ్లు పడుకోవడం సాధ్యం కాదని చెప్పారు. నివాసం ఉంటున్న సొంత స్థలానికి పొజిషన్ సర్టిఫికేట్ ఇచ్చి పట్టా అంటారా అని ప్రశ్నించారు. పది లక్షల విలువైన స్థలాన్ని 50 లక్షలకు కొని, ప్రజలకు మాత్రం సెంటు భూమి మాత్రమే ఇస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇళ్ల పట్టాల కొనుగోలులో 6500 కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు. దమ్ముంటే ఇళ్ల పట్టాలపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. జేట్యాక్స్ కోసమే కొత్త పథకాలు ప్రారంభిస్తున్నారని విమర్శించారు అచ్చెన్నాయుడు.

Tags

Next Story