Kinjarapu Atchannaidu: చంద్రబాబుపై సీఎం జగన్ కక్ష సాధిస్తున్నారు

Kinjarapu Atchannaidu: చంద్రబాబుపై సీఎం జగన్ కక్ష సాధిస్తున్నారు
జగన్ పిచ్చి పరాకాష్టకు చేరింది-టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు

రాష్ట్రంలో రాజకీయ కాక్ష తప్ప చట్టం, ధర్మం లేదన్నారు టీడీపీ నేత అచ్చెన్నాయుడు. టీడీపీ నేత చంద్రబాబు అరెస్ట్‌పై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చం నాయుడు స్పందించారు. విశాఖలో ప్రెస్ మీట్ నిర్వహించి ఆయన సీఎం జగన్‌పై పలు విమర్శలు చేశారు. సంఘీభావం తెలపడానికి వచ్చిన పవన్ కళ్యాణ్‌పై అనుచితంగా వ్యవహరించారు. ఈ అరాచకాలపై న్యాయస్థానంలో తేల్చుకుంటానన్నారు.

చంద్రబాబుపై సీఎం జగన్ కక్ష సాధిస్తున్నారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమర్శించారు. స్కిల్ కేసులో ఇరికించి చంద్రబాబు నాయుడుతో అధికారులు వ్యవహరిస్తున్న తీరు సమంజసంగా లేదన్నారు. ఇది ఏపికి చీకటి రోజుగా భావిస్తున్నాం అని అసహనం వ్యక్తం చేశారు. 2016లో జీవో ఇచ్చారు. 5 ఏళ్ల పాటు ఎంతోమందికి ఉపాధి లభించిందని గుర్తు చేశారు. సీమెన్స్ ద్వారా షెల్ కంపెనీల డబ్బు చంద్రబాబుకి చేరిందని అభియోగం చేశారు ఇది చాలా తప్పు అని ఆయన అన్నారు. సీఐడీ చీఫ్ ప్రెస్ మీట్‌లో చెప్పిన విషయాలే రిమాండ్ రిపోర్ట్‌లో పొందుపరిచారని మండిపడ్డారు. సీఐడీ సీఎం జగన్ చేతిలో కీలు బొమ్మగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు ఏళ్ల క్రితమే ఈ కేసు పెట్టారు. అప్పుడు లేని పేర్లు ఇప్పుడు ఎందుకు పెట్టారు..? అని ప్రశ్నించారు.చంద్రబాబు అరెస్టు ప్రజాస్వామ్యానికి చీకటి రోజు అని ఆయన ప్రకటించారు. 2015-16లో జీవో ఇచ్చి కేబినెట్లో చర్చించి ప్రవేశ పెట్టిన బడ్జెట్ ను అసెంబ్లీ ఆమోదించింది.. స్కిల్ డవలప్ మెంట్ ప్రాజెక్ట్ వల్ల ఎందరో శిక్షణ పొందారని సీఐడీనే చెప్పింది.. స్కిల్ అక్రమాలు కేసు ఊహాజనితమైన అంశాలపై ఆధారపడి పెట్టినవే అచ్చెన్నాయుడు తెలిపారు.


ఇప్పుడు తాజాగా మళ్ళీ రీఓపెన్ చేసి కక్ష సాధింపు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ కేసులో చంద్రబాబు కానీ, నేను కానీ ఏ వ్యక్తికి అయన లాభం చేకూర్చిమని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటాం అని సవాల్‌ చేశారు. కేవలం ఇది రాజకీయ కక్ష…కేసులకి టీడీపీ నేతలు భయపడరని ధీమ వ్యక్తం చేశారు. అవినీతికి కేరాఫ్ అడ్రస్ జగన్ మోహన్‌రెడ్డి ఉన్నారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. జగన్ తన తండ్రి పదవి అడ్డుపెట్టుకుని అవినీతి సామ్రాజ్యం నిర్మించుకున్నారు. రాష్ట్రంలో డై వెర్షన్ పోలటిక్స్‌గా భావిస్తున్నాం అని అయన అన్నారు. న్యాయస్థానంలోనే తెల్చుకుంటాం అన్నారు. ఫార్మర్ సీఎం అయిన చంద్రబాబునీ అరెస్ట్ చేయాలంటే గవర్నర్ సంతకం తీసుకోవాలని గుర్తు చేశారు. ప్రస్తుతానికి గవర్నర్ అపాయింట్‌మెంట్ రద్దు అయిందాని, రేపు సమయం గవర్నర్ స్పందిస్తారని ఆశిస్తున్నాం అన్నారు .

Tags

Read MoreRead Less
Next Story