Chandrababu: దుర్గమ్మను దర్శించుకున్న చంద్రబాబు దంపతులు..

Chandrababu: దుర్గమ్మను దర్శించుకున్న చంద్రబాబు దంపతులు..
తెలుగు జాతికి సేవ చేసే అవకాశం ఇవ్వాలని వేడుకున్నానన్న చంద్రబాబు

తెలుగుజాతిని అగ్రస్థానంలో నిలబెట్టేందుకు ఎన్ని దుష్ట శక్తులనైనా ప్రతిఘటిస్తూ ముందుకెళ్తానని తెలుగుదేశం అధినేత చంద్రబాబు స్పష్టంచేశారు. సతీమని భువనేశ్వరితో కలిసి విజయవాడ కనకదుర్గను దర్శించుకున్నారు. చంద్రబాబు దంపతులను అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. దర్శనానంతరం వేద పండితులు వేదాశీర్వచనం చేసి అమ్మవారి ప్రసాదం, శేషవస్త్రం అందించారు. తెలుగు ప్రజానీకానికి సేవ చేసి రాష్ట్రానికి పూర్వవైభవం తెచ్చే శక్తి ప్రసాదించాలని కనకదుర్గమ్మను వేడుకున్నట్లు తెదేపా అధినేత చంద్రబాబు తెలిపారు.

తెలుగు ప్రజలు సిరి సంపదలతో, ఆనందంగా జీవించేందుకు వారికి సేవ చేసే అవకాశం అమ్మవారు ప్రసాదిస్తారని నమ్ముతున్నానన్నారు. విజయవాడ కనకదుర్గమ్మను సతీసమేతంగా చంద్రబాబు ఇవాళ దర్శించుకున్నారు. తొలుత వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికారు. అనంతరం వేదపండితులు వేదాశీర్వచనం చేసి.. అమ్మవారి ప్రసాదం, చిత్రపటం అందజేశారు. సమాజాన్ని రక్షించి దుష్టుల్ని శిక్షించమని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు. మానవ సంకల్పానికి దైవ సహాయం ఎంతో అవసరమనే తొలుత దైవదర్శనాలు చేస్తున్నానన్నారు. విజయవాడకు వచ్చిన చంద్రబాబుకు ఎంపీ కేశినేని నాని, తెదేపా నేతలు కేశినేని చిన్ని, జనసేన నేత పోతిన మహేష్, ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ, అశోక్‌బాబు, నేతలు దేవినేని ఉమా, కొల్లు రవీంద్ర, యార్లగడ్డ వెంకట్రావు, మాగంటి బాబు, బుద్దా వెంకన్న, బోండా ఉమామహేశ్వరరావు తదితరులు స్వాగతం పలికారు.


స్కిల్ కేసులో హైకోర్టు బెయిల్ తర్వాత వరుసగా ఆలయ పర్యటనలు చేస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు ఇవాళ బెజవాడ కనక దుర్గమ్మను దర్శించుకున్నారు. సతీమణి భువనేశ్వరితో కలిసి చంద్రబాబు దుర్గమ్మ దర్శనం చేసుకున్నారు. అనంతరం ఆలయం బయటికి వచ్చి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా చంద్రబాబు రాష్ట్రంలో రాజకీయాల గురించి నాలుగు రోజులు మాట్లాడనంటూనే పరోక్ష వ్యాఖ్యలు చేశారు. మానవ సంకల్పానికి దేవుని ఆశీస్సులు కోసం ఈ యాత్రకు శ్రీకారం చుట్టానని చంద్రబాబు ఆలయాల సందర్శనపై వ్యాఖ్యానించారు. రేపు సింహాచలం దర్శనం చేసుకుని, 5న శ్రీశైల దర్శనం, అనంతరం దర్గా కు కూడా వెళతానన్నారు.అనంతరం భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని తెలిపారు. రాష్ట్రంలో మరల పూర్వ వైభవం వచ్చి ప్రజలకు న్యాయం జరిగేలా ఆశీర్వచనం ఇవ్వమని దుర్గమ్మను కోరుకున్నట్లు చంద్రబాబు వెల్లడించారు.


Tags

Read MoreRead Less
Next Story