ఏపీ ప్రభుత్వంపై టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం

ఏపీ ప్రభుత్వంపై టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం
ఆక్సిజన్ అందక ప్రజలు ప్రాణాలు కోల్పోతుంటే జగన్‌ రెడ్డి చోద్యం చూస్తున్నారంటూ మండిపడ్డారు టీడీపీ అధినేత చంద్రబాబు.

ఆక్సిజన్ అందక ప్రజలు ప్రాణాలు కోల్పోతుంటే జగన్‌ రెడ్డి చోద్యం చూస్తున్నారంటూ మండిపడ్డారు టీడీపీ అధినేత చంద్రబాబు. రాష్ట్రంలో ఆక్సిజన్ కొరత తీర్చడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ఆక్సిజన్‌ను బ్లాక్‌లో అమ్ముకుంటున్న కంపెనీలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం మొద్దు నిద్ర వీడి.. అటువంటి వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. విజయనగరంలోని మహారాజ ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక కరోనా పేషెంట్లు చనిపోవడం బాధాకరం అని అన్నారు చంద్రబాబు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

Tags

Next Story