జ్ఞానం లేని ముఖ్యమంత్రి అజ్ఞానంగా వ్యవహరిస్తున్నారు : చంద్రబాబు

జ్ఞానం లేని ముఖ్యమంత్రి అజ్ఞానంగా వ్యవహరిస్తున్నారు : చంద్రబాబు
రామతీర్ధం వెళ్లే వాళ్లను వైసీపీ ప్రభుత్వం ఎందుకు అడ్డుకుంటోందని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. రాముడి విగ్రహం ధ్వంసం చేసినప్పుడే ప్రభుత్వం సిగ్గుతో తల వంచుకోవాలని మండిపడ్డారు.

రామతీర్ధం వెళ్లే వాళ్లను వైసీపీ ప్రభుత్వం ఎందుకు అడ్డుకుంటోందని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. రాముడి విగ్రహం ధ్వంసం చేసినప్పుడే ప్రభుత్వం సిగ్గుతో తల వంచుకోవాలని మండిపడ్డారు. తనపై కేసు ఎందుకు పెడతారని ధ్వజమెత్తారు. అటు జ్ఞానం లేని ముఖ్యమంత్రి అజ్ఞానంగా వ్యవహరిస్తున్నారని చంద్రబాబు నిప్పులు చెరిగారు. కరోనా పట్ల ప్రభుత్వం ప్రదర్శించిన నిర్లక్ష్యం అందరినీ ఇబ్బంది పెట్టిందని ధ్వజమెత్తారు. అమరావతి రాజధాని పేరు చెప్తేనే సీఎంకు కంపరంగా ఉందని అన్నారు. ఏడాది కాలంగా రైతులు ఆందోళన చేస్తుంటే సీఎంకు పట్టదా అని ప్రశ్నించారు. పేకాట ఆడితే ఏమవుతుందంటూ మంత్రి వ్యాఖ్యలు చేస్తున్నారని చంద్రబాబు నిప్పులు చెరిగారు. ఇలాంటి మంత్రులు ఉండటం ప్రజల దౌర్భాగ్యం అని అన్నారు.

Tags

Read MoreRead Less
Next Story