ఆడపిల్లలకు మేనమామగా ఉంటానన్న జగన్.. ఈ రోజు వాళ్ల పాలిట కంసుడిగా మారాడు: చంద్రబాబు

ఏపీలో వైసీపీ పాలనలో శాంతిభద్రతలు దిగజారిపోయాయని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఏపీలో ప్రభుత్వ వైఫల్యం వల్ల మహిళలపై దాడులు పెరిగిపోయాయని అన్నారు. జగన్ 19 నెలల పాలనలో జరిగినన్ని అత్యాచారాలు గతంలో ఎప్పుుడూ జరగలేదని తెలిపారు. బడుగు, బలహీన వర్గాల ప్రాణాలంటే జగన్‌కు విలువ లేదా అని ప్రశ్నించారు. ఆడబిడ్డల శీలం అంటే లెక్కలేదా అని ధ్వజమెత్తారు.
అనంతపురం జిల్లాలో యువతి స్నేహలత హత్యకు ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని విమర్శించారు. ఫిర్యాదుపై పోలీసులు సరైన సమయంలో స్పందించి ఉంటే దారుణం జరగకపోయేదని అన్నారు. వరుస ఘటనలు జరుగుతుంటే జగన్ ఒక్కమాట మాట్లాడటంలేదని మండిపడ్డారు. సీఎం, పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.
ఏపీలో ప్రజల్ని ఆదుకోలేని చేతగాని దద్దమ్మ ప్రభుత్వం దుర్మార్గమైన ప్రభుత్వం అలసత్వం వల్లే అరాచకాలు పెరిగిపోయాయని చంద్రబాబు నిప్పులుచెరిగారు. ముఖ్యమంత్రి జగన్ సిగ్గుతో తలదించుకోవాలి అని మండిపడ్డారు. ప్రజల మానానికి, ప్రాణానికి కూడా రక్షణ లేక పోతే ఎలా అని ప్రశ్నించారు. ఈ ఘటనలపై ముఖ్యమంత్రి ఏం చర్యలు తీసుకున్నారని నిలదీశారని నిలదిశారు. జగన్ లాంటి నాయకులు చరిత్రహీనులుగా మిగిలిపోతారని అన్నారు. స్నేహలత హత్యపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
ఏపీలో అసలు రూల్ ఆఫ్ లా ఉందా అని చంద్రబాబు అన్నారు. ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకోవాల్సిన సమయం వచ్చిందని ప్రజలు పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ఎంత మందిని జైల్లో పెడుతారో చూద్దామని అన్నారు. ఆటవిక పాలనలో ఎవరికీ రక్షణ లేకుండా పోయిందని నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులపైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆడపిల్లలకు మేనమామగా ఉంటానన్న జగన్ వాళ్ల పాలిట కంసుడిగా మారారని విమర్శించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com