ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్న చంద్రబాబు

ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్న చంద్రబాబు


టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఇవాళ ఢిల్లీ వెళ్ళనున్నారు. ఇవాళ సాయంత్రం హైదరాబాద్ నుంచి ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. రేపు రాష్ట్రపతిభవన్‌లో జరిగే ఎన్టీఆర్ ప్రత్యేక నాణెం విడుదల కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం... రేపు మధ్యాహ్నం కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలుస్తారు. ఏపీలో ఓట్ల అవకతవకలపై సీఈసీకి ఫిర్యాదు చేయనున్నారు. టీడీపీ అనుకూల ఓట్లు తొలగించడంపై సీఈసీ కి వివరిస్తారు.

ఓట్ల తొలగింపులో ఉరవకొండ తరహా ఘటనలు అనేక ఉన్నాయని సీఈసీ దృష్టికి తీసుకెళ్లనున్నారు. వైసీపీ సానుభూతిపరులకు సంబంధించిన దొంగ ఓట్లను చేర్చడం, టీడీపీ అనుకూల ఓట్లను తొలగిస్తున్నారని, వాలంటీర్లతో టీడీపీ, వైసీపీ అనుకూల ఓట్ల సమాచారాన్ని ప్రభుత్వం సేకరిస్తోందని ఈసీకి వివరించనున్నారు. ఇలాంటి అక్రమాల ద్వారా జగన్‌ సర్కారు అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని ఫిర్యాదు చేయనున్న్నారు.

ఓట్ల అక్రమాలపై ఉరవకొండ, పర్చూరు, విజయవాడ, విశాఖ తదితర ఘటలకు సంబంధించిన ఆధారాలను అందజేస్తారు. అటు.. టీడీపీ నేతల ఫిర్యాదులను అధికారులు పట్టించుకోవడం లేదంటూ... వివరిస్తారు. ఈ అక్రమాలు నివారించాలని, బాధ్యులైన ప్రతి ఒక్కరిపైనా చర్యలు తీసుకోవాలని కోరనున్నారు చంద్రబాబు.

Tags

Read MoreRead Less
Next Story