Chandrababu Naidu : రఘురామపై తప్పుడు కేసులు పెడితే మాట్లాడకూడదా? చంద్రబాబు

Chandrababu Naidu : వైసీపీ ఎంపీ రఘురామపై తప్పుడు కేసులు పెడితే మాట్లాడకూడదా? అని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఎవరికి అన్యాయం చేసిన మా పార్టీ అండగా నిలుస్తుందన్నారు. టీడీపీ నుంచి వైసీపీ ముగ్గురు ఎమ్మెల్యేలను లాక్కుందని అన్నారు. ఇక రాష్ట్రం అంటే ఒక వ్యక్తి ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించడం కాదని.. రఘురామ అరెస్టులో పోలీసులు నిబంధనలు పాటించలేదని మండిపడ్డారు. అధికారం శాశ్వతం కాదని చంద్రబాబు హితవు పలికారు.
అటు ఎంపీ రఘురామ కృష్ణరాజు కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రికి ఎంపీ రఘురామని తరలించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈరోజే ఆయనని సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రికి తరలించాలని చెప్పింది. అక్కడే వైద్య పరీక్షలు నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. జ్యుడిషియల్ అధికారి పర్యవేక్షణలో ఎంపీ రఘురామకు వైద్య పరీక్షలు నిర్వహించాలని సూచించింది. జ్యుడిషియల్ అధికారిని తెలంగాణ హైకోర్టు నియమించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com