Chandra Babu : జగనన్న కాలనీలు కాదు.. జలగన్న కాలనీలు : చంద్రబాబు

Chandra Babu : జగనన్న కాలనీలు కాదు.. జలగన్న కాలనీలు : చంద్రబాబు
Chandra Babu : పోలవరంపై ఇప్పుడేం సమాధానం చెప్తావంటూ ముఖ్యమంత్రి జగన్‌ను సూటిగా ప్రశ్నించారు చంద్రబాబు

Chandra Babu : పోలవరం ప్రాజెక్టు విషయంలో హైదరాబాద్‌ ఐఐటీ రిపోర్ట్‌ను అస్త్రంగా చేసుకుని వైసీపీ ప్రభుత్వ ఆరోపణలను బలంగా తిప్పికొడుతోంది టీడీపీ.. ఆ పార్టీ స్ట్రాటజిక్‌ కమిటీ సమావేశంలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు.. పోలవరంపై ఇప్పుడేం సమాధానం చెప్తావంటూ ముఖ్యమంత్రి జగన్‌ను సూటిగా ప్రశ్నించారు.. దకేంద్ర ప్రభుత్వ వ్యవస్థల నుంచి నిపుణుల నివేదికల వరకు జగన్‌దే తప్పని తేల్చారన్నారు.. పోలవరం ప్రాజెక్టులో రాష్ట్ర ప్రభుత్వ తప్పిదాలను పీపీఏ, కేంద్రం, నిపుణుల కమిటీ తేల్చి చెప్పాయన్నారు చంద్రబాబు..

పోలవరం కాంట్రాక్టర్‌ను మార్చవద్దని పీపీఏ, కేంద్ర జలవనరుల శాఖ రాసిన లేఖలను, చేసిన హెచ్చరికలను నాడు జగన్‌ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు చంద్రబాబు.. 2014లో నా ప్రయత్నంగా కారణంగా ఏపీలో చేరిన పోలవరం విలీన గ్రామాలు ఇప్పుడు ఈప్రభుత్వ వైఖరితో మళ్లీ తెలంగాణలో కలపాలనే డిమాండ్‌ చేస్తున్నాయన్నారు.. పోలవరం ముంపు బాధితులకు ఆర్‌ అండ్‌ ఆర్‌ పరిహారంపై జగన్‌ ఇచ్చిన హామీలు, పునరావాస కాలనీలు నిర్మాణం ఏమయ్యాయని చంద్రబాబు ప్రశ్నించారు.

ఇక జగన్‌ సర్కార్‌ అవలంబిస్తున్న విధానాలపైనా విమర్శలు గుప్పించారు చంద్రబాబు.. పేదలకు ఇచ్చింది జగనన్న కాలనీలు కాదని.. జలగన్న కాలనీలంటూ ఎద్దేవా చేశారు.. గోదావరి వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం నూరు శాతం విఫలమైందన్నారు.. రాష్ట్రంలో విద్యార్థులకు పాఠ్యపుస్తకాల పంపిణీ విషయంలో విద్యాశాఖ దారుణంగా విఫలమైందన్నారు.. రాష్ట్రంలో బడుల విలీనం పేరుతో మూసివేస్తున్న ప్రభుత్వం బార్లు మాత్రం తెరుస్తోందని చంద్రబాబు విమర్శించారు.

రాష్ట్రంలోని కోటి 42 లక్షల కార్డుదారులందరికీ బియ్యం పంపిణీ చేయాలని డిమాండ్‌ చేశారు.. ఇక అప్పుల విషయంలో జగన్‌ సర్కార్‌ సమాధానం పెద్ద బూటకమన్నారు చంద్రబాబు..దీనిపై శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.. అదాన్‌ డిస్టిలరీకి రెండేళ్లలోనే 2,400 కోట్ల విలువైన ఆర్డర్లు ఏవిధంగా ఇచ్చారని ప్రశ్నించారు.. దీనిపై ఈడీ విచారణ జరగాలని చంద్రబాబు డిమాండ్‌ చేశారు.

Tags

Read MoreRead Less
Next Story