Project Baata: కర్నూలులో అడుగుపెట్టిన చంద్రబాబు

ప్రాజెక్టుల సందర్శన కోసం టీడీపీ అధనేత చంద్రబాబు కర్నూలు జిల్లాలో అడుగు పెట్టారు. ఓర్వకల్లు ఎయిర్‌పోర్ట్‌లో చంద్రబాబుకు టీడీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. పెన్నా టు వంశధార పేరుతో వైసీపీ ప్రభుత్వ హయాంలో నిలిచిపోయిన ప్రధాన ఇరిగేషన్ ప్రాజెక్టులను క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించనున్నారు. ముచ్చుమర్రి - బనకచర్ల ప్రాజెక్టులను సందర్శించనున్నారు. ప్రాజెక్టులను పరిశీలించిన అనంతరం పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌లో పాల్గొంటారు. నందికొట్కూరు రోడ్ షోలో పాల్గొనున్న చంద్రబాబు.. అనంతరం బహిరంగ సభలో ఆయన ప్రసంగింస్తారు. ఈ రాత్రికి జమ్మలముడుగు వెళ్లనున్నారు చంద్రబాబు.
చంద్రబాబు ఇవాళ్టి నుంచి నాలుగు రోజులు పాటు రాయలసీమలో పర్యటిస్తున్నారు. పెండింగ్ ప్రాజెక్టులు, ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగడుతూ వచ్చే ఎన్నికలకు పార్టీ శ్రేణుల్లో సమరోత్సహాన్ని నింపనున్నారు. ఇందులో భాగంగా రేపు కడప, ఎల్లుండి అనంతపురం, నాలుగో రోజు చిత్తూరులో పర్యటిస్తారు. రేపు కొండాపురం ప్రాజెక్టును పరిశీలించి.. పులివెందులలో రోడ్ షో నిర్వహిస్తారు. అలాగే పులివెందుల పూల అంగళ్ల సర్కిల్లో బహిరంగ సభలో పాల్గొంటారు. సీఎం జగన్ సొంత నియోజకవర్గం పులివెందులలో చంద్రబాబు పర్యటనపై ఉత్కంఠ నెలకొంది. పులివెందులలో చంద్రబాబు సభను జిల్లా టీడీపీ నేతలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. సీఎం సొంత నియోజకవర్గంలో దుస్థితిని బయటి ప్రపంచానికి చెప్పడానికే చంద్రబాబు వస్తున్నారంటున్నారు టీడీపీ నేతలు. ప్రభుత్వం అనుమతివ్వకపోయినా చంద్రబాబు పులివెందుల రోడ్‌షో కొనసాగుతుందని స్పష్టంచేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com