పార్లమెంటు కొత్త భవనంపై చంద్రబాబు ట్వీట్

పార్లమెంటు కొత్త భవనం ప్రారంభోత్సవంపై టీడీపీ అధినేత చంద్రబాబు ట్వీట్ చేశారు.. కొత్త పార్లమెంటు భవన నిర్మాణం చరిత్రాత్మకమైనదన్నారు.. ఈ చారిత్రక కట్టడాన్ని నిర్మించడంలో దోహదపడిన ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్రానికి ధన్యవాదాలు అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు.. దేశ భవిష్యత్తుకు అవసరమైన మార్పులు, చట్టాల రూపకల్పనకు ఈ భవనం వేదిక కావాలని ఆకాంక్షించారు.. 2047 నాటికి స్వాతంత్ర్యం వచ్చి వందేళ్లు పూర్తయ్యే నాటికి పేదరికం లేని భారతదేశం ఏర్పాటుకు కొత్త పార్లమెంటు భవనం దిక్సూచి కావాలన్నారు చంద్రబాబు.
ఈనెల 28 నూతన పార్లమెంట్ భవనాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు.. ఈ కార్యక్రమానికి రావాలంటూ అన్ని రాజకీయ పార్టీలకు లోక్‌సభ సెక్రటరీ జనరల్ ఆహ్వానాలు పంపారు.. ఎన్డీయే పక్షాలతోపాటు మరికొన్ని ప్రాంతీయ పార్టీలు ఈ కార్యక్రమానికి హాజరవుతున్నట్లు ప్రకటించాయి.. కొత్త పార్లమెంటు భవన ప్రారంభోత్సవానికి హాజరు కావాలని టీడీపీ కూడా నిర్ణయించింది.. టీడీపీ తరపున హాజరు కావాల్సిందిగా రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్‌కు చంద్రబాబు సూచించారు.
https://twitter.com/ncbn/status/1661680901317615616
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com