ప్రభుత్వ అలసత్వం వల్లే ఈ దాడులు : చంద్రబాబు

ఏపీలో ఆలయాలపై జరుగుతున్న దాడులను టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రంగా ఖండించారు.. రాష్ట్రంలో దేవాలయాలపై దాడులు నిత్యకృత్యం అవడం దురదృష్టకరమన్నారు.. రాష్ట్రంలో ప్రజలకు రక్షణ లేదని కనీసం గుళ్లో దేవుళ్లకు కూడా రక్షణ లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ అలసత్వం వల్లే ఈ దాడులు జరుగుతున్నాయని చంద్రబాబు అన్నారు..
రాజమండ్రిలో విఘ్నేశ్వరస్వామి ఆలయంలో సుబ్రహ్మణ్య స్వామి విగ్రహ ధ్వంసం ఘటనను చంద్రబాబు ఖండించారు.. వరుసగా చోటు చేసుకుంటున్న ఈ దురాగతాల నివారణకు ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందో ప్రజలకు చెప్పాలన్నారు.. విజయవాడ దుర్గగుడిలో మాయమైన మూడు సింహాలను ఇప్పటి వరుక ఎందుకు గుర్తించలేదని నిలదీశారు.
అంతర్వేదిలో రథం తగులబెట్టిన నిందితులను ఇప్పటి వరకు అరెస్టు చేయలేదని ఫైరయ్యారు. జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి హిందూ ధర్మాలకు, సంప్రదాయాలకు కళ్లెం పడిందన్నారు. దేశంలో ఎక్కడా లేనంతగా రాష్ట్రంలో దేవుళ్లపై దాడులు జరుగుతున్నాయని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com