బీటెక్‌ రవి అరెస్టు పై చంద్రబాబు ఆగ్రహం!

బీటెక్‌ రవి అరెస్టు పై  చంద్రబాబు ఆగ్రహం!
టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్‌ రవి అరెస్టుపై ఆ పార్టీ అధినేత చంద్రబాబు తీవ్రంగా స్పందించారు.. పోలీసుల తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు..

టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్‌ రవి అరెస్టుపై ఆ పార్టీ అధినేత చంద్రబాబు తీవ్రంగా స్పందించారు.. పోలీసుల తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.. నెలరోజుల క్రితం ముఖ్యమంత్రి జగన్‌ సొంత నియోజకవర్గం పులివెందులలో ఎస్సీ మహిళపై అత్యాచారం ఘటనను నిరసిస్తూ టీడీపీ చలో పులివెందులకు పిలుపునివ్వగా, వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టడం దుర్మార్గమన్నారు. దుర్ఘటనకు కారకులైన వారిపై చర్యలు తీసుకోకుండా, ఘటనను వెలుగులోకి తీసుకొచ్చిన టీడీపీ నాయకులను అరెస్టు చేయడం సిగ్గు చేటన్నారు.

ఎస్సీలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసులు పెట్టడం మరో దుర్మార్గ చర్యగా చంద్రబాబు అభివర్ణించారు. ఏపీలో చట్టబద్ధ పాలన లేదనడానికి ఇదే నిదర్శనమన్నారు.. ఎస్సీ, ఎస్టీ చట్టం దుర్వినియోగంలో పరాకాష్ట అన్నారు.. చలో పులివెందుల కార్యక్రమం నిర్వహించారన్న అక్కసుతోనే టీడీపీ నాయకులపై తప్పుడు కేసులు పెట్టి అక్రమ నిర్బంధాలు చేస్తున్నారని మండిపడ్డారు.

బాధితులకు అండగా ఉండటం టీడీపీ నేతలు చేసిన నేరమా అని చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.. నిందితులపై చర్యలు తీసుకోవాలని కోరడం టీడీపీ నాయకులు చేసిన అపరాధమా అంటూ నిలదీశారు. ఎస్సీలపై దమనకాండకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోరా అని చంద్రబాబు ప్రశ్నించారు. నెలరోజుల క్రితం ఎస్సీ మహిలపై అత్యాచారానికి పాల్పడిన వాళ్లపై ఇంత వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు.

దానిని నిలదీసిన వాళ్లపై అక్రమ కేసులు బనాయించడాన్ని తప్పు పట్టారు. జగన్‌ రెడ్డి పాలనలో రాష్ట్రంలో నిందితులు నిర్భీతిగా తిరుగుతున్నారు. బాధఙతులపైనే తప్పుడు కేసులు పెడుతున్నారని ఫైరయ్యారు.. ప్రజల ప్రాథమిక హక్కులను కాలరాస్తున్నారన్నారు. ఈ దుర్మార్గ చర్యలను రాష్ట్ర ప్రజలంతా గర్హించాలన్నారు చంద్రబాబు. వైసీపీ ప్రభుత్వ దమనకాండను అన్ని వర్గాల ప్రజలు నిరసించాలని, బాధిత కుటుంబాలకు అండగా ఉండాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.

Tags

Read MoreRead Less
Next Story