ఆలయాలను కాపాడుకోకపోతే ముఖ్యమంత్రిగా జగన్ ఎందుకు? : చంద్రబాబు

శ్రీరాముడిని కాపాడే బాధ్యత సీఎం జగన్‌కు లేదా? అని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. ఈ సీఎంని నరరూప రాక్షసుడు అనాలా?.. ఏమనాలి? అంటూ ఫైర్ అయ్యారు. ఈ వ్యవస్థ భ్రష్టు పట్టడానికి జగనే కారణమన్నారు. తన హయాంలో మసీదు, చర్చిలపై దాడులు జరిగాయా? దేశమంతా జై శ్రీరామ్ నినాదం మార్మోగుతుంటే.. ఉత్తరాంధ్ర అయోధ్యలో రామచంద్రుడి తల నరికారు. ఎన్టీఆర్ హయాంలో రామరాజ్యం చూశాం. పోలీసులు తమాషాలు చేస్తున్నారా?... అందరూ తిరగబడితే పోలీసులు పారిపోతారు. పోలీసులు నా ముందు తోక తిప్పుతారా?'' అని చంద్రబాబు ప్రశ్నించారు.
జగన్ ప్రభుత్వం దేవాలయాల భూముల్ని అన్యాక్రాంతం చేస్తోందంటూ ఆరోపించారు చంద్రబాబు. గోశాలలను కూడా లేకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారంటూ మండిపడ్డారు. ప్రతి ఒక్క కేసును రీఓపెన్ చేయిస్తామని తప్పుడు కేసులు పెట్టినవారికి శిక్ష తప్పదని హెచ్చరించారు. సీఎం హోదాలో ఉండి మత మార్పిడులు చేయాలనుకోవడం ద్రోహమన్నారు చంద్రబాబు. కేవలం ఒక మతానికే కొమ్ముకాస్తారా అంటూ ప్రశ్నించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com