ఎస్‌ఈసీకి చంద్రబాబు లేఖ.. తన నియోజకవర్గంలో అసాంఘిక శక్తులు చొరబడ్డాయని..

X
By - TV5 Digital Team |16 Feb 2021 7:00 PM IST
రేపు జరిగే మూడో విడత పంచాయతీ ఎన్నికలపై ఉత్కంఠ నెలకొంది. టీడీపీ అధినేత చంద్రబాబు నియోజకవర్గంలో కుప్పంలో కూడా రేపే ఎన్నికలు జరగనుంది.
రేపు జరిగే మూడో విడత పంచాయతీ ఎన్నికలపై ఉత్కంఠ నెలకొంది. టీడీపీ అధినేత చంద్రబాబు నియోజకవర్గంలో కుప్పంలో కూడా రేపే ఎన్నికలు జరగనుంది. ఈ నేపథ్యంలో ఎస్‌ఈసీకి చంద్రబాబు లేఖ రాశారు. తన నియోజనర్గంలోఅసాంఘిక శక్తులు చొరబడ్డాయని ఆయన లేఖలో పేర్కొన్నారు. ఎన్నడూలేని విధంగా కుప్పంలోని పంచాయతీల్లో అలజడి రేకెత్తించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని లేఖలో తెలిపారు. కొన్ని పంచాయతీల్లో భద్రత పటిష్టం చేయాలని... మరికొన్ని మండలాల్లో ప్రత్యేక భద్రత, ఉన్నతాధికారుల పర్యవేక్షణ ఉండాలని లేఖ ద్వారా ఎస్ఈసీని చంద్రబాబు కోరారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com