ఏపీలో అరాచక పాలన కొనసాగుతోంది : టీడీపీ అధినేత చంద్రబాబు

ఏపీలో అరాచక పాలన కొనసాగుతోంది : టీడీపీ అధినేత చంద్రబాబు
ఏపీలో అరాచక పాలన కొనసాగుతుందని మండిపడ్డారు టీడీపీ అధినేత చంద్రబాబు. ప్రభుత్వం ఎన్ని కేసులు పెట్టినా భయపడేది..

ఏపీలో అరాచక పాలన కొనసాగుతుందని మండిపడ్డారు టీడీపీ అధినేత చంద్రబాబు. ప్రభుత్వం ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదన్నారు. కేవలం లెటర్‌ ఇచ్చారనే ఆరోపణలతో అచ్చెన్నాయుడిని అన్యాయంగా అరెస్ట్‌ చేశారని, ఆపరేషన్ చేయించుకున్న వ్యక్తిని 600 కి.మీ ప్రయాణం చేయడం వల్లే మళ్లీ ఆపరేషన్‌ చేయాల్సి వచ్చిందన్నారు. ఎంత దుర్మార్గంగా వ్యవహరించారో ఈ ఘటనలే నిదర్శనమని పేర్కొన్నారు. పోలీసులు కూడా డబ్బులు తీసుకోలేదని చెప్పారని గుర్తుచేశారు. కోర్టు కూడా సరైన ఆధారాలు లేవని వ్యాఖ్యానించిందన్నారు. ప్రజా సమస్యలపై పోరాడుతున్నందునే అచ్చెన్నాయుడు నోరు నొక్కుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అచ్చెన్నాయుడు అనారోగ్యంగా ఉన్నా అరెస్టుచేసి, కరోనారావడానికి కారణమయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. కొల్లు రవీంద్ర అజాత శత్రువు..అని ఎవరికీ హాని చేసే వ్యక్తి కాదన్నారు. తాము అధికారంలో ఉన్నప్పుడు ఇలాగే ఆలోచిస్తే వైసీపీ నేతలు ఎక్కడ ఉండేవాళ్లు? అని ప్రశ్నించారు. అధికారం శాశ్వతం కాదని గుర్తుపెట్టుకోవాలని సూచించారు. ఎవరైనా విలువలతో కూడిన రాజకీయాలు చేయాలన్నారు. రాష్ట్రంలో జగన్ నియంతృత్వంతో అరాచక పాలన సాగుతోందని చంద్రబాబు మండిపడ్డారు.

వైసీపీ సర్కార్‌లా ఇంత దారుణంగా గతంలో ఏ ప్రభుత్వం ‌వ్యవహరించలేదన్నారు. నిజంగా ఈ నీచ పాలన చూసి చాలా బాధేస్తోందని వ్యాఖ్యానించారు. అధికారులు కూడా చట్ట ప్రకారం నడుచుకోవాలని చంద్రబాబు సూచించారు. 43 ఏళ్ల తన రాజకీయ జీవితంలో ఇంత దుర్మార్గమైన పాలన చూడలేదన్నారు. కార్యకర్తలు అధైర్యపడవద్దని, ధైర్యంగా పోరాడాలన్నారు. ప్రజలు కూడా ఈ రాక్షస ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని పిలుపునిచ్చారు. మాజీ మంత్రులు అచ్చెన్న, కొల్లురవీంద్రను చంద్రబాబు పరామర్శించారు. పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

Tags

Read MoreRead Less
Next Story