జగన్ రెడ్డి నిరంకుశ పాలనలో ప్రజాస్వామ్యం అపహాస్యం : చంద్రబాబు

వైసీపీ ఉన్మాదం పరాకాష్టకు చేరిందన్నారు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు. వారి ప్రవర్తన చూస్తుంటే దిగ్బ్రాంతి కల్గుతుందన్నారు. పొన్నూరు దళిత యువకుడు బేతమల మణిరత్నం అరెస్టు ఉన్మాద చర్యగా అభివర్ణించారు. గోడపై పోస్టర్ వేయడంలో ఏమి హానికరం ఉందని బాబు ట్వీట్ చేశారు. అదే జిల్లాలో మైనర్ బాలికపై అత్యాచారం ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులు నిర్బీతిగా తిరుగుతున్నారని చంద్రబాబు ఆవేదన వ్యక్తంచేశారు. జగన్ రెడ్డి నిరంకుశ పాలనలో ప్రజాస్వామ్యం అపహాస్యం అవుతుందన్నారు.
Next Story