24 Dec 2020 9:30 AM GMT

Home
 / 
ఆంధ్రప్రదేశ్ / స్నేహలత తల్లిని...

స్నేహలత తల్లిని పరామర్శించిన చంద్రబాబు!

స్నేహలత కుటుంబానికి ఫోన్‌ చేసి పరామర్శించారు టీడీపీ అధినేత చంద్రబాబు. పార్టీ తరపున అండగా ఉంటామని, న్యాయం జరిగే వరకు పోరాడతామని భరోసా ఇచ్చారు

స్నేహలత తల్లిని పరామర్శించిన చంద్రబాబు!
X

స్నేహలత కుటుంబానికి ఫోన్‌ చేసి పరామర్శించారు టీడీపీ అధినేత చంద్రబాబు. పార్టీ తరపున అండగా ఉంటామని, న్యాయం జరిగే వరకు పోరాడతామని భరోసా ఇచ్చారు. కంప్లైంట్ ఇచ్చిన వెంటనే పోలీసులు స్పందించి ఉంటే తన కూతురు బతికేదని చంద్రబాబుతో తన ఆవేదనను పంచుకున్నారు స్నేహలత తల్లి. డ్యూటీ ముగించుకుని వస్తున్న స్నేహలతను అత్యంత దారుణంగా చంపేశారు దుండగులు. ధర్మవరం నుంచి అనంతపురం వస్తున్న స్నేహలతను నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి గొంతు నులిమి హత్య చేశారు. ఆ తరువాత పొట్ట కింద భాగంలో నిప్పు అంటించారు. దీంతో స్నేహలత శరీర భాగం కొంత కాలింది. యువతిని చంపి, నిప్పు అంటించడం చూస్తుంటే దిశ ఘటనను తలపిస్తోంది.

Next Story