'సలాం కుటుంబం ఆత్మహత్య' కేసును సీబీఐకి అప్పగించాలి : టీడీపీ

సలాం కుటుంబం ఆత్మహత్య కేసును సీబీఐకి అప్పగించాలి : టీడీపీ

నంద్యాలలో అబ్దుల్ సలాం దీక్షా శిబిరం వద్ద హైడ్రామా నెలకొంది. శాంతి భద్రతల దృష్ట్యా దీక్ష ఆపాలని కోరారు పోలీసులు . అబ్దుల్ సలాం కుటుంబానికి న్యాయం చేస్తామని డీఎస్పీ చిదానందరెడ్డి హామీ ఇచ్చారు. దీంతో అబ్దుల్ సలాం న్యాయ పోరాట కమిటీ సభ్యులు దీక్ష విరమించారు. నిందితుల బెయిల్ రద్దు కాకపోతే కార్యాచరణ ప్రకటిస్తామని స్పష్టం చేసింది... అబ్దుల్‌ సలాం కేసును ప్రభుత్వం బలహీనపరిచేందుకు చూస్తోందని అబ్దుల్‌ సలాం న్యాయ పోరాట సమితి ఆరోపిస్తోంది. దోషులకు శిక్ష పడేంత వరకు తాము పోరాటం చేస్తామని కమిటీ సభ్యులు హెచ్చరించారు..

అంతకు ముందు... అబ్దుల్ సలాం కేసును సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు మాజీ మంత్రి అఖిలప్రియ. న్యాయపోరాట కమిటీ సబ్యులతో కలసి దీక్షకు కూర్చున్నారు. సలాం కేసులో సెక్షన్లు పెట్టిన మీరే.. వారికి బెయిల్ ఇప్పించారని ఆరోపించారు. కావాలని ఆళ్లగడ్డ-నంద్యాల మధ్య విభేదాలు సృష్టిస్తున్నారన్నారు. నంద్యాలకు శిల్పా కుటుంబం వచ్చిన తర్వాతే దౌర్జన్యాలు మొదలయ్యాయని అఖిలప్రియ ధ్వజమెత్తారు. అబ్దుల్‌ సలాం కుటుంబం ఆత్మహత్య ఘటన దోషులను కఠినంగా శిక్షించాలని, కేసును సీబీఐకి అప్పగించాలని టీడీపీ డిమాండ్‌ చేస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story