లంకమట్టి తవ్వకాలపై టీడీపీ ఆందోళన

లంకమట్టి తవ్వకాలపై టీడీపీ ఆందోళన
పశ్చిమగోదావరి జిల్లా పెరుగులంక మట్టి తవ్వకాలపై విపక్షాలు టీడీపీ ఆధ్వర్యంలో ఆందోళనకు దిగాయి.

పశ్చిమగోదావరి జిల్లా పెరుగులంక మట్టి తవ్వకాలపై విపక్షాలు టీడీపీ ఆధ్వర్యంలో ఆందోళనకు దిగాయి. టీడీపీ అధికార ప్రతినిధి మాణిక్యాలరావు, ఎమ్మెల్యే రామానాయుడు ఆధ్వర్యంలో నిరసన చేశారు. దళితులు చేస్తున్న పోరాటానికి సంఘీభావం తెలిపారు. రెండ్రోజుల క్రితం పోలీసులకు, దళితులకు మధ్య జరిగిన గొడవల్లో... గాయాలపాలైన బాధితుల్ని పరామర్శించారు. అనంతరం లంకమట్టి తవ్వకాల ప్రదేశానికి వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే.. పోలీసులు వీరిని అడ్డుకున్నారు. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన టీడీపీనేతలు... న్యాయపోరాటం చేస్తామన్నారు.


Tags

Read MoreRead Less
Next Story