నంద్యాల ఘటనపై నిరసన జ్వాలలు

నంద్యాల ఘటనపై నిరసన జ్వాలలు పెల్లుబికుతున్నాయి.. అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్యకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ముస్లిం, మైనార్టీ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.. రాష్ట్రంలో ముస్లింలపై జరుగుతున్న అత్యాచారాలు, దాడులకు వ్యతిరేకంగా విజయవాడలో మైనార్టీల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ముస్లిం, ధార్మిక సంఘాలతోపాటు రాజకీయ పార్టీల నేతలు కూడా సమావేశంలో పాల్గొన్నారు.నంద్యాల ఘటనను వారంతా ముక్తకంఠంతో ఖండించారు.. దాడులకు వ్యతిరేకంగా కార్యాచరణ రూపొందించారు.
రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న బాధితులు వారికి జరిగిన అన్యాయాన్ని ఈ వేదికగా వినిపించారు. రాజకీయ పార్టీలు ముస్లింలను ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తున్నాయని ముస్లిం లీగ్ పార్టీ అధ్యక్షుడు బషీర్ అహ్మద్ మండిపడ్డారు.. ఈ పరిస్థితి మారాలన్నారు.. ముస్లింలంతా రోడ్డెక్కాల్సిన అవసరం ఉందని గుర్తు చేశారు. అటు టీడీపీ, జనసేన నేతలు కూడా ముస్లింలపై జరుగుతున్న దాడులను ఖండించారు. జగన్ ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలకు రక్షణ లేకుండా పోయిందని మండిపడ్డారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
