ఘనంగా టీడీపీ మహానాడు; వంటల ఘుమఘుమలు

రాజమహేంద్రవరంలో ఘనంగా టీడీపీ మహానాడు జరుగుతోంది. 2 రోజుల పాటు జరగనున్న ఈ కార్యక్రమంలో తేేదేపా అధినేత చంద్రబాబునాయుడు ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. పార్టీ శ్రేణులకు దిశానిర్ధేశం చేయడంతో పాటు ఎన్నికల సమరానికి సిద్ధమయ్యేలా కార్యాచరణ కూడా రూపొందించనున్నారు. ఎన్నికల ఏడాదిలో అనుసరించాల్సిన వ్యూహాల రూపకల్పనతో పాటు మహానాడు వేదికగా ఎన్నికల తొలి మేనిఫెస్టో ప్రకటించనున్నారు. మరోవైపు మహానాడుకి విచ్చేయబోతున్న అతిథులకి నోరూరించే వంటకాల్ని టీడీపీ సిద్ధం చేస్తోంది. విజయవాడలోని అంబికా క్యాటరింగ్ అండ్ ఈవెంట్స్‌కు వంట బాధ్యతల్ని టీడీపీ అప్పగించింది. దాదాపు 1500 మంది వంటవాళ్లు 200 వంటకాల్ని అతిథుల కోసం సిద్ధం చేస్తున్నారు. శనివారం ప్రతినిధుల సభ జరగబోతుండగా ఈరోజు టిఫిన్ కింద ఇడ్లీ, వడ, మైసూర్ భజ్జీతో పాటు పునుగులు, పొంగల్, టమాటా బాత్, కొబ్బరి చట్నీ, అల్లం చట్నీ, సాంబార్ రెడీ చేశారు. ఆ తర్వాత మధ్యాహ్నం, రాత్రి భోజనాల్లో వెజ్ బిర్యానీ, బంగాళదుంప కుర్మా, మామిడికాయ పప్పు, గోంగూర, గుత్తు వంకాయ, మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ, సాంబారు, పెరుగు అలానే మజ్జిగ పులుసుని కూడా వడ్డించబోతున్నారు. అదనంగా కాకినాడ కాజా, యాపిల్ హల్వా, తాపేశ్వరం గొట్టం కాజా కూడా అతిథులకి వడ్డించనున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com