TDP: జగన్-భారతీ కోట్లు దోచేశారు

సరస్వతి పవర్ కంపెనీ పేరుతో సీఎం జగన్, భారతీ కోట్లాది రూపాయలు దోచేశారని తెలుగుదేశం నేత ఆనం వెంకటరమణారెడ్డి..ఆరోపించారు. ఉత్పత్తి లేకుండా విచ్చలవిడిగా షేర్ల విలువలను పెంచుకున్నారని ధ్వజమెత్తారు. నెల్లూరు తెలుగుదేశం కార్యాలయంలో మాట్లాడిన ఆయన గోడ, గుడిసెలేని కంపెనీకి అన్ని షేర్లు ఎలా పెరిగాయని ప్రశ్నించారు. సిమెంట్ కంపెనీకి అనుమతి రాకపోయినా సరస్వతి కంపెనీ పేరుతో లైమ్ స్టోన్ కు అనుమతులు ఇచ్చారని ఆనం ఆరోపించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు జగన్ ఇలాంటి ఆర్థిక నేరాలకు పాల్పడినందుకే జైలుకు వెళ్లారని ఆనం అన్నారు.
ప్రజలపై ఆర్థికభారం మోపడంలో ముఖ్యమంత్రి జగన్ అన్నివర్గాలకు సామాజిక న్యాయం చేశారని మాచర్ల నియోజకవర్గ తెలుగుదేశం అభ్యర్థి బ్రహ్మానందరెడ్డి ఎద్దేవా చేశారు. హైదరాబాద్ కూకట్ పల్లిలో ఉంటున్న మాచర్ల నియోజకవర్గ ప్రజలతో... ఆయన ఆత్మీయ సమావేశం నిర్వహించారు. వైసీపీ ప్రభుత్వం.. ఏపీని అన్ని రకాలుగా నాశనం చేసిందని మండిపడ్డారు. సైకోపాలనకు స్వస్తి చెప్పి అందరి మేలు కోరే ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో తనకు ఓట్లు వేసి గెలిపించాలని బ్రహ్మానంద రెడ్డి కోరారు.
మరోవైపు జనసేన అధినేత పవన్ పై హరిరామజోగయ్య కుమారుడు చేగొండి సూర్యప్రకాష్ విమర్శలు చేయడాన్ని ఆ పార్టీ పీఏసీ కమిటీ సభ్యుడు పంతం నానాజీ... ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వలాభం కోసం పార్టీ మారిన సూర్యప్రకాష్. పవన్ సమయం ఇవ్వలేదని అనటం హ్యాస్యాస్పదమన్నారు. హరిరామజోగయ్య కుమారుడిగానే...... సూర్యప్రకాశ్ తమకు తెలుసన్న నానాజీ ఐదేళ్లుగా జనసేనలో ఉండి పార్టీ కోసం...... ఆయన చేసేంది ఏమి లేదన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com