'నో'టిపారుదల శాఖ మంత్రిపై పట్టాభి కౌంటర్ ఎటాక్..

నోటిపారుదల శాఖ మంత్రిపై పట్టాభి కౌంటర్ ఎటాక్..
X

ఏడాదిన్నరగా వైసీపీ సర్కారు విస్మరించినందుకే పోలవరం ప్రాజెక్ట్‌ అటకెక్కిందన్నారు టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి. టీడీపీ ప్రభుత్వం కృషి వల్లే రూ.55548 కోట్ల సవరించిన అంచనాలకు కేంద్రం అంగీకరించిందని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం చేతకానితనాన్ని టీడీపీపై నెట్టడం అర్థరహితమంటూ ఫైర్‌ అయ్యారు. పోలవరంపై మంత్రి అనిల్‌కు ఏం తెలుసని సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. అనిల్‌ జలవనరుల మంత్రిగా ఉండటం రాష్ట్రం చేసుకున్న దౌర్భాగ్యమన్నారు. కేబినెట్‌ నోట్‌ చదివినా అర్థంకాక ఏదిపడితే అది మాట్లాడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు పట్టాభి.

Tags

Next Story