స్థానిక సంస్థల ఎన్నికలపై టీడీపీ నేత జేసీ దివాకర్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు

X
By - kasi |19 Nov 2020 3:25 PM IST
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై టీడీపీ నేత జేసీ దివాకర్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేశ్ ఉన్నంత కాలం స్థానిక ఎన్నికలు జరగవు అని అన్నారు..
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై టీడీపీ నేత జేసీ దివాకర్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేశ్ ఉన్నంత కాలం స్థానిక ఎన్నికలు జరగవు అని అన్నారు. ఎస్‌ఈసీ నిర్వహించే వీడియో కాన్ఫరెన్స్‌లకు అధికారులు హాజరుకారని అభిప్రాయం వ్యక్తంచేశారు. ఎన్నికలు ఆలస్యం చేయడం వెనుక ఏపీ ప్రభుత్వ ఎత్తుగడ ఉందని జేసీ ఆరోపించారు. ఎస్‌ఈసీగా జస్టిస్ కనగరాజ్‌ను నియమించిన తర్వాత ఎన్నికలు జరుపుతారని అన్నారు. గతంలో ఏకగ్రీవమైన స్థానాలు కరెక్ట్ అంటూ కనగరాజ్‌తో ఆదేశాలు వచ్చేలా చేస్తారని వ్యాఖ్యానించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతిపక్షాలు పోటీ చేయకపోవడమే బెటర్ అని... ఒకవేళ ప్రతిపక్షాలు గెలిచినా ఏదో కేసుపెట్టి అరెస్ట్ చేస్తారని జేసీ అన్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com