cabinet Ministers list: పౌరవిమానయాన శాఖ మంత్రిగా రామ్మోహన్ నాయుడు

ప్రధాని నరేంద్రమోదీ కేబినేట్‌లో చోటు దక్కించుకున్న తెలుగు రాష్ట్రాల ఎంపీలకు శాఖలు కేటాయించారు. రామ్మోహన్ నాయుడికి పౌరవిమానయాన బాధ్యతలు అప్పగించారు. గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్‌ను గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్లు శాఖ సహాయ మంత్రిగా నియమించారు. నరసరాపురం ఎంపీ భూపతిరాజు శ్రీనివాస వర్మను భారీ పరిశ్రమలు, ఉక్కుశాఖ సహాయ మంత్రిగా శాఖలు కేటాయించారు. తెలంగాణ నుంచి జి.కిషన్ రెడ్డికి బొగ్గు, గనులు.. బండి సంజయ్ కుమార్ హోంశాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు అప్పగించారు. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌ను హోంశాఖ సహాయ మంత్రిగా నియమించారు. ప్రధాని మోదీతో పాటు ఆదివారం 71 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. అందులో 30 మంది కేబినెట్ మంత్రులు కాగా.. 36 మంది సహాయ మంత్రులుగా, ఐదుగురు స్వత్రంత్ర మంత్రులు ఉన్నారు. వీరికి తాజాగా కేటాయింపులు జరిపారు. కేంద్రమంత్రులుగా ప్రమాణం చేసిన వారికి ప్రధాని మోదీ శాఖలు కేటాయించారు. ముందుగా అనుకున్నట్లే కీలక శాఖలను బీజేపీ నేతలకే కట్టబెట్టారు. రాజ్‌నాథ్ సింగ్, అమిత్‌షా, నితిన్ గడ్కరీ, నిర్మలా సీతారామన్ వంటి సీనియర్లకు పాత శాఖలనే కేటాయించారు.
ఇతర మంత్రుల శాఖలు ఇవే..
1. రాజ్‌నాథ్ సింగ్ (బీజేపీ)- రక్షణ శాఖ
2. అమిత్ షా (బీజేపీ)- హోంమంత్రిత్వ శాఖ
3. నితిన్ గడ్కరీ (బీజేపీ)- రోడ్లు, రహదారులు
4. జగత్ ప్రకాశ్ నడ్డా (బీజేపీ)- ఆరోగ్యశాఖ
5. శివరాజ్ సింగ్ చౌహాన్ (బీజేపీ)- వ్యవసాయం, రైతు సంక్షేమం
6. నిర్మలా సీతారామన్ (బీజేపీ)- ఆర్థికశాఖ
7. సుబ్రహ్మణ్యం జైశంకర్ (బీజేపీ)- విదేశీ వ్యవహారాలు
8. మనోహర్ లాల్ ఖట్టర్ (బీజేపీ)- విద్యుత్, గృహనిర్మాణశాఖ
9. హెచ్.డి. కుమారస్వామి (జేడీఎస్)- భారీ పరిశ్రమలు, ఉక్కు
10. పీయూష్ వేద్ ప్రకాశ్ గోయల్ (బీజేపీ) కామర్స్ అండ్ ఇండస్ట్రీస్
II. ధర్మేంద్ర ప్రధాన్ (బీజేపీ) - విద్యాశాఖ
12. జీతన్ రామ్ మాంఝి (కొత్త) (హెచ్ఎఎం)
13. రాజీవ్ రంజన్ (లలన్)సింగ్ (కొత్త) (జేడీయూ)
14. సర్బానంద్ సోనోవాల్ (బీజేపీ)- షిప్పింగ్, పోర్టులు
15. వీరేంద్ర కుమార్ (బీజేపీ)
16. కింజరాపు రామ్మోహన్ నాయుడు (కొత్త) (తెదేపా) - పౌర విమానయాన శాఖ
17. ప్రహ్లాద్ వెంకటేష్ జోషి (బీజేపీ)
18. జుయెల్ ఓరం (కొత్త) (బీజేపీ)
19. గిరిరాజ్ సింగ్ (బీజేపీ)
20. అశ్వినీ వైష్ణవ్ (బీజేపీ) - రైల్వే, సమాచారశాఖ
21. జ్యోతిరాదిత్య సింధియా (బీజేపీ) - టెలికాం
22. భూపేంద్ర యాదవ్ (బీజేపీ)
23. గజేంద్రసింగ్ షెకావత్ (బీజేపీ)- పర్యాటక, సాంస్కృతికశాఖ
24. అన్నపూర్ణాదేవి (బీజేపీ)
25. కిరణ్ రిజిజు (బీజేపీ) - పార్లమెంటరీ వ్యవహారాలు
26. హర్దీప్ సింగ్ పూరి (బీజేపీ) - పెట్రోలియంశాఖ
27. మనస్సుఖ్ ఎల్. మాండవీయ (బీజేపీ) -
28. గంగాపురం కిషన్ రెడ్డి (బీజేపీ) - బొగ్గు, గనులు
29. చిరాగ్ పాస్వాన్ (ఎలేపీ-పాస్వాన్) - క్రీడాశాఖ, యువజన వ్యవహారాలు
30. సి.ఆర్.పాటిల్ (బీజేపీ )- జలశక్తి
సహాయ మంత్రులు (స్వతంత్ర హోదా)
31. రావ్ ఇంద్రజిత్ సింగ్ (బీజేపీ)
32. జితేంద్రసింగ్ (బీజేపీ)
33. అర్జున్ రామ్ మేఘ్ వాల్ (బీజేపీ)
34. ప్రతాప్ రావ్ గణపత్‌రావ్ జాదవ్ (శివసేన)
35. జయంత్ చౌధరి (ఆర్ఎల్డీ)
సహాయ మంత్రులు
36. జితిన్ ప్రసాద (బీజేపీ)
37. శ్రీపాద యశోనాయక్ (బీజేపీ)
38. పంకజ్ చౌధరి (బీజేపీ)
39. క్రిషన్ పాల్ (బీజేపీ)
40. రామ్ దాస్ అఠావలె (ఆర్ పీఐ)
41. రామ్ నాథ్ ఠాకూర్ (కొత్త) (జేడీయూ)
42. నిత్యానందరాయ్ (బీజేపీ)
43. అనుప్రియ పటేల్ (అప్నాదళ్)
44. వి.సోమన్న (బీజేపీ)-
45. పెమ్మసాని చంద్రశేఖర్ (టీడీపీ)- గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్స్
46. ఎస్.పి.సింగ్ బఘేల్ (బీజేపీ)-
47. శోభా కరంద్లాజే (బీజేపీ)-
48. కీర్తివర్ధన్సింగ్ (బీజేపీ)-
49. బీఎల్ వర్మ (బీజేపీ) -
50. శాంతనూ ఠాకూర్ (బీజేపీ) -
51. సురేష్ గోపి (బీజేపీ) -
52. ఎల్.మురుగన్ (బీజేపీ) -
53. అజయ్ టంటా (బీజేపీ) -
54. బండి సంజయ్ కుమార్ (బీజేపీ) - హోంశాఖ
55. కమలేష్ పాశ్వాన్ (బీజేపీ) -
56. భగీరథ్ చౌదరి (బీజేపీ) -
57. సతీశ్ చంద్రదూబే (బీజేపీ) -
58. సంజయ్ సేఠ్ (బీజేపీ)-
59. రవ్‌నీత్ సింగ్ బిట్టూ (బీజేపీ) -
60. దుర్గాదాస్ ఉయికె (బీజేపీ)-
61. రక్షా నిఖిల్ ఖడ్సే (బీజేపీ)
62. సుఖాంత మజుందార్ (బీజేపీ)
63. సావిత్రి ఠాకుర్ (బీజేపీ)
64. టోకన్ సాహు (బీజేపీ )
65. రాజభూషణ్ చౌదరి (బీజేపీ)-
66. భూపతిరాజు శ్రీనివాస వర్మ (బీజేపీ) - భారీ పరిశ్రమలు, ఉక్కు
67. హర్ష్ మల్హోత్రా (బీజేపీ)
68. నిముబెన్ జయంతిభాయ్ బాంభణియా (బీజేపీ)
69. మురళీధర్ మొహోల్ (బీజేపీ)
70. జార్జ్ కురియన్ (బీజేపీ)
71. పబిత్ర మార్గరీటా (బీజేపీ)
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com