Yuvagalam: 194వ రోజు నారా లోకేష్ పాదయాత్ర

టీడీపీ యువనేత నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర అశేష జనవాహిని మధ్య కొనసాగుతోంది. ఎక్కడికక్కడ లోకేష్‌కు ఘన స్వాగతం లభిస్తోంది. లోకేష్ వెంట పార్టీ నేతలు, కార్యకర్తల తోపాటు ప్రజలు, అభిమానులు అడుగులో అడుగు వేస్తున్నారు. దారి పొడువునా ప్రజలకు అభివాదం చేసుకుంటూ ముందుకు సాగుతున్నా నారా లోకేష్.. వారి సమస్యల్ని స్వయంగా అడిగి తెలుసుకుంటున్నారు. అయితే జన తాకిడి ఎక్కువగా ఉండటంతో లోకేష్ చేతికి పలు చోట్ల గాయాలు అయ్యాయి. వేళ్లకు బొబ్బలెక్కటంతో ఇబ్బంది పడుతున్నారు లోకేష్. రోడ్డు పైనే పస్ట్ ఎయిడ్ చేశారు ఆయన సహాయక సిబ్బంది. ఓ వైపు గాయం బాధిస్తున్నా పాదయాత్రను కొనసాగిస్తున్నారు లోకే ష్.
ఉమ్మడి కృష్ణా జిల్లా నూజివీడు నియోజకవర్గంలో నారా లోకేష్ పాదయాత్ర కొనసాగుతోంది. ఇవాళ 194వ రోజు మీర్జాపురం శివారు క్యాంప్ సైట్ నుంచి పాదయాత్ర ప్రారంభమైంది.మీర్జాపురం స్థానికులతో సమావేశమయ్యారు యువనేత. మొరసపల్లిలో ముస్లింలతో ముఖాముఖి నిర్వహిస్తారు. తర్వాత తుక్కలూరు లో ఎస్సీ సామాజికవర్గీయులతో ముచ్చటిస్తారు.
సాయంత్రం 4గంటలకు పాదయాత్ర తిరిగి ప్రారంభంకానుంది. 4గంటల 15నిమిషాలకు మామిడి రైతులతో సమావేశమవుతారు. 6గంటల 45నిమిషాలకు ఆర్యవైశ్యులతో భేటీ అవుతారు. ఎంప్లాయిస్ కాలనీలో స్థానికులతో స్థానికులతో భేటీ కానునన్నారు యువనేత లోకేష్.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com