179వ రోజు కొనసాగుతున్న లోకేష్ పాదయాత్ర

టీడీపీ జాతీయ ప్రధాన కార్యద్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర కొనసాగుతోంది. ఇవాల్టితో లోకేష్ పాదయాత్ర 179వ రోజుకు చేరింది. ఇప్పటి వరకు లోకేష్ 2373 కిలోమీటర్లు నడిచారు. గురజాల నియోజకవర్గంలోని పిడుగురాళ్ల వావెళ్ల గార్డెన్స్ నుంచి పాదయాత్ర ప్రారంభమైంది. లోకేష్‌కు అడుగడునా ఘనంగా స్వాగతం చెబుతున్నారు ప్రజలు. పాదయాత్రలో దారిపొడవునా టీడీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. అందరిని పలకరిస్తూ ముందుకు సాగుతున్నారు లోకేష్.
సత్తెనపల్లి నియోజకవర్గంలో యువగళం ప్రవేశించింది . అనంతరం కొండమోడు, అనుపాలెంలో స్థానికులతో భేటీ అవుతారు. భోజన విరామం అనంతరం చౌటపాపాయపాలెం నుంచి పాదయాత్ర కొనసాగిస్తారు. సాయంత్రం చౌటపాపాయపాలెంలో బహిరంగ సభలో లోకేష్ ప్రసంగిస్తారు. ఆ తర్వాత.. యువగళం పాదయాత్ర . పెదకూరపాడు నియోజకవర్గంలోకి ప్రవేశిస్తుంది. అనంతరం నాగిరెడ్డిపాలెంలో స్థానికులతోనూ, బెల్లంకొండలో బుడగజంగాలతో లోకేష్ సమావేశమవుతారు. ఇవాళ రాత్రి మాచయపాలెం విడిది కేంద్రంలో లోకేష్ బస చేస్తారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com