టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి కారు ధ్వంసం

టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి కారు ధ్వంసం

విజయవాడలో టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌ కారు ధ్వంసం చేశారు దుండగులు. రాత్రి ఆయన నివాసంలో ఉన్న కారుపై బండరాళ్లు వేశారు. అద్దాలు కూడా పగలగొట్టారు. ఘటన జరిగిన తీరు చూస్తే ఇది వైసీపీ పనిగానే కనిపిస్తోందని పట్టాభి ఆరోపిస్తున్నారు. తరచుగా వైసీపీ ప్రభుత్వ విధానాల్ని ప్రశ్నిస్తున్నందునే తనను టార్గెట్ చేసినట్టు కనిపిస్తోందంటున్నారు. విజయవాడలో వీఐపీలు ఉండే ఏరియాలోనే పట్టాభి కారుపై దాడి జరిగిందంటే.. సామాన్యుడి పరిస్థితి ఏంటి అనే ప్రశ్నలు కూడా ఇప్పుడు తలెత్తుతున్నాయి. ఎక్కడికక్కడ విధానపరమైన లోపాల్ని ప్రశ్నిస్తున్న వారిపై దాడులు జరుగుతుండడం చూస్తుంటే వైసీపీ కక్ష సాధింపులకు పాల్పడుతున్నట్టు అర్థమవుతోందంటున్నారు.

Tags

Next Story