Fake Votes : తిరుపతి RDO కార్యాలయం ఎదుట తెదేపా నేత నాని ఆమరణ నిరాహార దీక్ష

X
By - Sathwik |8 Jan 2024 12:15 PM IST
ఓటమి భయంతోనే దొంగ ఓట్లు అంటూ ఆందోళన
చంద్రగిరి నియోజకవర్గంలో దొంగ ఓట్లను తొలగించడం లేదని తిరుపతి RDO కార్యాలయం ఎదుట తెదేపా నేత నాని ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. బోగస్ ఓట్లతో వైకాపా నేత మోహిత్ రెడ్డిని గెలిపించుకోవాలని...ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని నాని అన్నారు. ఓటమి భయంతోనే ఎమ్మెల్యే దొంగ ఓట్లను సృష్టిస్తున్నారని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా తమ నియోజకవర్గంలోనే భారీగా దొంగ ఓట్లు నమోదు అయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ నాయకులతో కలసి పోరాటం చేస్తున్నా... అధికారులు మాత్రం పట్టించుకోలేదని ఆరోపించారు. దొంగ ఓట్లను తొలగించేంత వరకు ఆమరణ నిరాహార దీక్షను విరమించబోనని నాని తెలిపారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com