ఏపీ డీజీపీ తీరుపై వర్ల రామయ్య ఆవేదన..

ఏపీ డీజీపీ తీరుపై వర్ల రామయ్య ఆవేదన..

ఏపీ డీజీపీ తీరుపై టీడీపీ నేత వర్ల రామయ్య ఆవేదన వ్యక్తం చేశారు. దాడికేసును క్షుణ్ణంగా దర్యాప్తు చేయమని అడిగితే.. సాక్ష్యాలు సీల్డ్‌ కవర్‌లో పంపమని ఎద్దేవ చేస్తారా అని వర్ల ప్రశ్నించారు.. ఇలా లేఖ రాయడం రాజ్యంగ విరుద్దమన్నారు. రాజ్యంగంలోని ఆర్టికల్‌ -19(1)(ఏ) స్ఫూర్తికి వ్యతిరేకంగా లేఖ ఉందని.. అది తమ అధినేత చంద్రబాబు ప్రాథమిక హక్కుని హరించే విధంగా ఉందన్నారు. అంతర్వేది స్వామివారి రథాన్ని తగలబెట్టింది చంద్రబాబే అని.. విజయసాయిరెడ్డి ఆరోపిస్తే సాక్ష్యాలు ఎందుకు అడగలేదని ప్రశ్నించారు.

అలాగే చంద్రబాబు-తిరుమల పవిత్రతను తప్పుపట్టేలా బూతులు మాట్లాడిని మంత్రి కొడాలిపై ఎందుకు స్పందించలేదని నిలదీశారు. రామచంద్రారెడ్డిపై దాడి కేసులు ముద్దాయి ప్రతాపరెడ్డి టీడీపికి చెందిన వ్యక్తి అని చెప్పడానికి మీదగ్గర ఉన్న ఆధారాలేంటని? ముద్దాయి ప్రతాప్‌ రెడ్డి టీడీపీ వ్యక్తి అని చెప్పడానికి మీరు చూపించిన ఉత్సాహం వెనుకున్న మర్మం ఏంటని వర్ల రామయ్య ప్రశ్నించారు.

Tags

Read MoreRead Less
Next Story