అమరావతి ప్రాంతంలో టీడీపీ నేతల బృందం పర్యటన

X
అమరావతి ప్రాంతంలోని వెంకటపాలెం సీడ్ యాక్సిస్ వద్ద గత ప్రభుత్వం నిర్మించిన ఇళ్లను టీడీపీ నేతల బృందం పరిశీలించింది.. రాజధాని రైతులు, దళితులు, అమరావతి జేఏసీతో కలిసి మాజీ మంత్రి దేవినేని ఉమ, మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్ ఆ ప్రాంతంలో పర్యటించారు. రాజధానిలో గత ప్రభుత్వం నిర్మించిన ఇళ్లను వెంటనే లబ్ధిదారులకు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు.. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులు అన్యాయానికి గురవుతున్నారని మండిపడ్డారు. రాజధానిలో 5,500 ఇళ్లను గత ప్రభుత్వం నిర్మిస్తే వాటిని లబ్ధిదారులకు ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రంగులేసుకునే అధికారం ఈ ప్రభుత్వానికి ఎవరిచ్చారని మాజీ మంత్రి దేవినేని ఉమ ప్రశ్నించారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
