ఇళ్ల స్థలాలకు భూసేకరణలో 4వేల కోట్ల స్కామ్ : టీడీపీ ఎంపీలు
పార్లమెంటును కూడా రాజకీయ పబ్బం గడుపుకునేందుకు విజయసాయిరెడ్డి ప్రయత్నించారని టీడీపీ ఎంపీలు ఫైర్ అయ్యారు. కొవిడ్‌పై చర్చించాల్సిన సందర్భంలో ఆంధ్రప్రదేశ్‌లో ఏసీబీ విచారణ, కోర్టుల దుర్వినియోగం అంటూ అసంబద్ధ అంశాలను లేవనెత్తారని అన్నారు. పార్లమెంట్ లో జరిగే చర్చను సైతం రాజకీయం చేస్తున్నారని కనకమేడల రవీంద్రకుమార్ ఫైర్ అయ్యారు.
జగన్ సీఎం అయ్యాక అన్ని వ్యవస్థలను బెదిరించి తన గుప్పిట్లో ఉంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారని.. మరో ఎంపీ రామ్మోహన్ నాయుడు మండిపడ్డారు. న్యాయ వ్యవస్థ ను సైతం బ్లాక్ మెయిల్ చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. గతంలో వారికి అనుకూలంగా కోర్టులు తీర్పులు వచ్చినప్పుడు అభ్యంతరాలు ఎందుకు వ్యక్తం చేయలేదని ప్రశ్నించారు.
16నెలల వైసీపీ పాలనలో అవినీతి కుంభకోణాలు అన్నింటిపై CBI దర్యాప్తును కోరాలని టీడీపీ నేతలు డిమాండ్ చేశారు. ఇళ్ల స్థలాలకు భూసేకరణలో 4వేల కోట్ల స్కామ్‌లపై సీబీఐ విచారణ జరపాలన్నారు. మద్యం నాసిరకం బ్రాండ్లు, జె ట్యాక్స్ వసూళ్లపై సీబీఐ దర్యాప్తునకు డిమాండ్ చేశారు. ఇసుక, లేటరైట్, గ్రానైట్ మైనింగ్ మాఫియా స్కామ్‌లపైనా సీబీఐ విచారణ కోరాలన్నారు. అంతర్వేదితో సహా ఆలయాలు అన్నింటిపై దురాగతాలపై దర్యాప్తు చేయాలని టీడీపీ నేతలు వైసీపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com