ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడు

ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడు

ఆంధ్రప్రదేశ్‌ నూతన రాష్ట్ర కమిటీ ఏర్పాటుపై టీడీపీ కసరత్తు పూర్తి చేసింది. ఈనెల 27వ తేదీన కమిటీని అధికారికంగా ప్రకటించనున్నారు. ఈసారి ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడు బాధ్యతలు చేపట్టనున్నారు. కళావెంకట్రావు స్థానంలో ఇకపై అచ్చెన్న ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా ఉంటారు. బీసీ సామాజికవర్గానికి చెందిన బలమైన నేతగా గుర్తింపు ఉన్న అచ్చెన్నకు సారథ్య బాధ్యతలు ఇవ్వడం ద్వారా పార్టీని మరింతగా బలోపేతం చెయ్యాలని జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు భావిస్తున్నారు.

అలాగే మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా 25 పార్లమెంట్ నియోజకవర్గాలకు 25 మంది అధ్యక్షుల్ని నియమించనున్నారు. పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా కొత్త జిల్లాల ఏర్పాటు ఉండబోతున్న నేపథ్యంలోనే ఈసారి ఈ నిర్ణయం తీసుకున్నారు. పార్లమెంట్ సెగ్మెంట్‌ పరిధిలోకి వచ్చే ఆరేడు అసెంబ్లీ నియోజకవర్గాల నేతలతో చర్చించి, సుదీర్ఘ కసరత్తు చేశాక కొత్త అధ్యక్షుల్ని ఖరారు చేశారు. అలాగే పార్టీ అనుబంధ విభాగాలకు కూడా కొత్త వారిని నియమించనున్నారు. ఈసారి యువతకు ప్రాధాన్యం ఇచ్చేలా కమిటీల రూపకల్పన జరిగిందని టీడీపీ ముఖ్యనేతలు చెప్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story