Babu Arrest: అరెస్ట్ పై భగ్గుమన్న కార్యకర్తలు, అభిమానులు

Babu Arrest: అరెస్ట్ పై  భగ్గుమన్న  కార్యకర్తలు, అభిమానులు
రాష్ట్ర వ్యాప్తంగా నిరసనల హోరు

చంద్రబాబు అరెస్ట్ పై తెలుగు దేశం శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనల హోరెత్తించారు. అధినేత అరెస్టుపై భగ్గుమన్న తెలుగుదేశం శ్రేణులు పోలీసుల అడ్డంకులు ఛేదించుకుని నిరసనల కదంతొక్కాయి . కాగడాలు, కొవ్వత్తుల ప్రదర్శనలతో చంద్రబాబుకు సంఘీభావం తెలిపాయి. నాయకులు, కార్యకర్తలు రోడ్లపై బైఠాయించి చంద్రబాబును విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.

NTR జిల్లా మైలవరంలో నిరసన తెలిపిన తెలుగు యువత అధ్యక్షుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ క్రమంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. వీరులపాడులో తెదేపా కార్యకర్తలు నిరసన తెలిపారు. తిరువూరులో మధిర రోడ్డు సెంటర్ నుంచి చీరాల సెంటర్ వరకు ర్యాలీ తీశారు. వారిని పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. గుడివాడలో వెనిగండ్ల రాము ఆధ్వర్యంలో కాగడాల ప్రదర్శన జరిగింది. పోలీసులు అడ్డుకునేందుకు యత్నించగా వాగ్వాదంచోటుచేసుకుంది.పల్నాడు జిల్లా నరసరావుపేటలో కాగడాల ర్యాలీ తీశారు. సీఎం జగన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బాపట్ల జిల్లా చీరాల గడియారస్తంభం కూడలిలో ధర్నా చేశారు.


ప్రకాశం జిల్లా సంతనూతలపాడు మండలం మైనంపాడులో మాజీ ఎమ్మెల్యే విజయ్ కుమార్ ఆధ్వర్యంలో కాగడాల ప్రదర్శన చేశారు. కనిగిరికొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించగా , నెల్లూరులో కాగడాల ప్రదర్శన చేసి రోడ్లపై టైర్లు దహనం చేశారు. పోలీసులు వారిని అడ్డుకుందుకు యత్నించడం ఉద్రిక్తతకు దారితీసింది. వరికుంటపాడు, కలిగిరి, ఉదయగిరి, సీతారాంపురంలో సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేసిన వారిని పోలీసులు అరెస్టు చేశారు. కడపలో తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ తీశారు. నల్ల కండువాలు, బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. బద్వేలులో తెదేపా నేతలను పోలీసులు అరెస్టు చేశారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో గాంధీ విగ్రహం నుంచి సోమప్ప కూడలి వరకు ర్యాలీ చేశారు. ఆదోనిలో తిమ్మరెడ్డి బస్ స్టాండ్ కూడలిలో మనవహారం చేశారు.

చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరులో రహదారులపైకి చేరిన నేతలను పోలీసులు అరెస్టు చేశారు.కుప్పంలో తెదేపా శ్రేణులు కాగడాలతో నిరసన తెలిపాయి. శ్రీకాకుళం రూరల్ పోలీసుస్టేషన్ వద్ద మహిళలు బైఠాయించారు. చంద్రబాబుకు మద్దతుగా నిలిచిన వారిని స్టేషన్‌లో నిర్బంధించడం తగడన్నారు. అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నరసన్నపేటలో మాజీ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శన జరిగింది. ఉమ్మడి విజయనగరం జిల్లాలో నిరసన ప్రదర్శనలు, ,తాళ్లవలసలో మానవహారం చేశారు. భీమునిపట్నంలో తెలుగు యువత ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు.


అనకాపల్లి జిల్లా రోలుగుంట, జగ్గంపేటలో కొవ్వొత్తులతో నిరసన తెలిపారు. కోనసీమ జిల్లా కొత్తపేటలో మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఆధ్వర్యంలో కాగడాల ప్రదర్శన జరిగింది. అమలాపురం, పి గన్నవరం , మామిడికుదురులో రహదారులపైకి వచ్చిన నేతలు. సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాజమహేంద్రవరంలో చంద్రబాబు అరెస్టు అక్రమమని తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకులో మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఆధ్వర్యంలో కాగడాల ప్రదర్శన చేశారు.

Next Story