టిడ్కో ఇళ్ల కేటాయింపుపై ప్రభుత్వానికి టీడీపీ అల్టిమేటం

టిడ్కో ఇళ్ల కేటాయింపుపై ప్రభుత్వానికి టీడీపీ అల్టిమేటం
టిడ్కో ఇళ్ల కేటాయింపుపై ప్రభుత్వానికి TDP అల్టిమేటం ఇచ్చింది. జనవరిలోగా ఇళ్లు కేటాయించకపోతే లబ్దిదారులతో కలిసి ఇళ్లను ఆక్రమిస్తామని టీడీపీ ప్రకటించింది..

టిడ్కో ఇళ్ల కేటాయింపుపై ప్రభుత్వానికి TDP అల్టిమేటం ఇచ్చింది. జనవరిలోగా ఇళ్లు కేటాయించకపోతే లబ్దిదారులతో కలిసి ఇళ్లను ఆక్రమిస్తామని టీడీపీ ప్రకటించింది. ఈ మేరకు విజయవాడలో ఉన్న టిడ్కో కార్యాలయంలో CEని కలిసిన టీడీపీ నేతలు వినతి పత్రం ఇచ్చారు. సొంతింటి కోసం ప్రజలు అప్పులు చేసి డబ్బు చెల్లించారని... తీసుకున్న అప్పుకు వడ్డీ పెరుగుతోంది కానీ ఇల్లు మాత్రం రావడం లేదని టీడీపీ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. చంద్రబాబు ఇళ్లు నిర్మించారనే కారణంతో... ఆ ఇళ్లను లబ్దిదారులకు ఇవ్వడం లేదని ఆయన మండిపడ్డారు.

Tags

Read MoreRead Less
Next Story