Chanadra Babu: బాబు అరెస్ట్‌కు నిరసనగా ఏపీలో ఆందోళనలు ..

Chanadra Babu:  బాబు అరెస్ట్‌కు నిరసనగా ఏపీలో ఆందోళనలు ..
సత్యమేవ జయతే అంటూ నిరసనలు

చంద్రబాబు జైలులో ఉన్నంత మాత్రాన అతన్నిదోషిఅనడం లేదని.. రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు అన్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి జగనే జైల్లో ఉండి వచ్చారని గుర్తు చేశారు. శ్రీకాకుళం DCCB కాలనీలో YSR అర్బన్ హెల్త్ సెంటర్ ను ప్రారంభించిన ధర్మాన... సంక్షేమ పథకాల సొమ్ము నేరుగా లబ్ధిదారుల ఖాతాలకే వెళ్లడం వల్ల... వైసీపీ కార్యకర్తలు దివాళా తీశారని వ్యాఖ్యానించారు.

తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడుకు మద్దతుగా తెలంగాణ ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాల ఎదుట విద్యార్థి సంఘాల నాయకులు సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. చంద్రబాబు అభిమాన సంఘం జాతీయ అధ్యక్షుడు తలారి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సంతకాల సేకరణ చేశారు. సీఎం జగన్ రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యన్ని ధిక్కరిస్తూ చంద్రబాబుపై అవినీతి ఆరోపణలు చేశారని విద్యార్థి సంఘాల నాయకులు మండిపడ్డారు.

మరోవైపు తెలుగుదేశం అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ..పార్టీ నాయకులు, కార్యకర్తలు చేపట్టిన దీక్షలు రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్నాయి. కాకినాడ జిల్లా, ప్రత్తిపాడు తహశీల్దార్ కార్యాలయం ఎదుట చేపట్టిన దీక్షకు రైతులు సంఘీభావం తెలిపారు. కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో పార్టీ నాయకులు, అభిమానులు మోకాళ్లపై దీక్ష చేశారు. పి.గన్నవరం, రాజోలులో దీక్షలు కొనసాగుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు జరుగుతున్న సామూహిక దీక్షలకు మహిళలు మద్దతు తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఆధ్వర్యంలో నిరసనలుకొనసాగుతున్నాయి.

కృష్ణాజిల్లా కంకిపాడు మండలం కొనతనపాడు వద్ద జాతీయ రహదారిపై తెలుగు యువత రాస్తారోకో నిర్వహించారు. రహదారిని దిగ్బంధించి.... టైర్లు కాలుస్తూ... నిరసన తెలిపారు. YSR జిల్లా మైదుకూరులో 'టీడీపీ శ్రేణులు చేపట్టిన దీక్షకు జనసైనికులు సంఘీభావం తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం కొమరిపాలెంలో నిర్వహించిన దీక్షల్లో మాజీ ఎమ్మెల్యే.. నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు.

Tags

Read MoreRead Less
Next Story