REVANTH: బీజేపీ నమ్మించి మోసం చేసింది

REVANTH: బీజేపీ నమ్మించి మోసం చేసింది
పసుపు బోర్డు ఏమైందని ప్రశ్నించిన రేవంత్‌... బీఆర్‌ఎస్‌-బీజేపీలపై విమర్శల జల్లు

పసుపుబోర్డు విషయంలో నిజామాబాద్ రైతులను బీజేపీ నమ్మించి మోసం చేసిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి..ఆరోపించారు. నిజామాబాద్ లోక్ సభ నియోజకవర్గ పరిధిలోనిఆర్మూర్ లో రోడ్ షో నిర్వహించిన ఆయన స్థానిక ఎంపీ అర్వింద్ పసుపు బోర్డుపై ఇచ్చిన హామీని ఐదేళ్లయినా నిలబెట్టుకోలేదని మండిపడ్డారు. పంజాబ్ , హరియాణా రైతులు మోదీ మెడలు వంచి నల్లచట్టాలు రద్దు చేయించారని తెలిపిన రేవంత్ రెడ్డి నిజామాబాద్ , ఆర్మూర్ రైతులు కూడా ఉత్తరాది రైతుల మాదిరిగా పోరాడాలని కోరారు. చక్కెర కర్మాగారం తెరిపించేందుకు ప్రభుత్వం కార్యాచరణ చేపట్టిందన్న ఆయన 42 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించేందుకు నిధులు విడుదల చేశామని గుర్తుచేశారు. ఈనెల 9లోపు రైతుభరోసా పూర్తి చేస్తామని చెప్పి ఆరునే నిధులు ఖాతాల్లో జమచేశామనిపేర్కొన్నారు. ఆగస్టు 15లోపు రుణమాఫీ చేసి తీరతానని పునరుద్ఘాటించారు.


నిజామాబాద్‌ ఎంపీగా పోటీ చేసినప్పుడు ఇచ్చిన హామీలను ఆ తర్వాత కవిత మరిచారని విమర్శించారు. పసుపుబోర్డు తెస్తానని చెప్పిన ధర్మపురి అర్వింద్‌ కూడా మోసం చేశారన్నారు. 2019లో రాజ్‌నాథ్‌సింగ్‌ను తీసుకొచ్చి పసుపుబోర్డుపై ప్రకటన చేయించిన అర్వింద్‌, ఇప్పుడు మోదీని తీసుకొచ్చి మళ్లీ అదే మాట చెప్పించారని ఎద్దేవా చేశారు. ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా మోదీ ఇలాగే హామీ ఇచ్చి కాలయాపన చేస్తారా? అని ప్రశ్నించారు. జీవన్‌రెడ్డిని గెలిపిస్తే ఆర్మూర్‌ను అభివృద్ధిపథంలో ముందుంచుతానని హామీ ఇచ్చారు. చక్కెర కర్మాగారం తెరిపించేందుకు ప్రభుత్వం కార్యాచరణ చేపట్టిందని, రూ.42 కోట్ల బకాయిలు చెల్లించేందుకు నిధులు విడుదల చేశామని సీఎం తెలిపారు.

చెప్పిన అబద్ధాన్నే మోదీ మళ్లీ చెబుతున్నారని రేవంత్‌రెడ్డి ఫైర్ అయ్యారు. దేవుడి పేరుతో రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. దేవుడు గుడిలో ఉండాలి భక్తి గుండెల్లో ఉండాలని అన్నారు. బీజేపీ అభ్యర్థికి అహంకారం ఎక్కువని ఫైర్ అయ్యారు. రైతు కష్టమేమిటో జీవన్ రెడ్డికి తెలుసన్నారు. ఆర్మూర్ లో సీఎం రేవంత్ రెడ్డి కార్నర్ మీటింగ్ నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోరాటపటిమ ఉన్నవాళ్లు ఆర్మూర్ రైతులని అన్నారు. 69 లక్షల మంది రైతులకు రైతుభరోసా ఇచ్చామని తెలిపారు. పంద్రాగస్టు కల్లా రుణమాఫీ చేస్తామని ప్రకటించారు. హరీశ్ రాజీనామాను జేబులో పెట్టుకోవాలని సిద్ధిపేటకు ఆయన పీడను వదిలిస్తానని చెప్పారు. నల్లా చట్టాలపై మోదీ మెడలు వంచిన చరిత్ర రైతులదని అన్నారు. కోడ్ ముగిసిన వెంటనే చక్కెర రైతులను ఆదుకుంటామని చెప్పారు.

కేసీఆర్ సవాళ్ల పైన నిలబడే వ్యక్తేనా అని ప్రశ్నించారు. అమరవీరుల స్థుపం కాడ కేసీఆర్ ముక్కు నేలకు రాయాలని అన్నారు. ఆర్మూర్ కు మున్సిపల్ కార్యాలయానికి రూ, 16 కోట్లు మంజూరు చేస్తామని చెప్పారు. ఒక్క అవకాశం జీవన్ రెడ్డికి ఇవ్వండని కోరారు. పసుపు బోర్డు రావాలంటే కాంగ్రెస్ గెలవాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

Tags

Read MoreRead Less
Next Story