శ్రీవారిని దర్శించుకున్న గవర్నర్ తమిళి సై !

శ్రీవారిని దర్శించుకున్న గవర్నర్ తమిళి సై !
తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్ ఈ రోజు ఉదయం కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్ ఈ రోజు ఉదయం కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో వచ్చిన ఆమెకు టీటీడీ అధికారులు, ప్రధాన అర్చకులు సాంప్రదాయ స్వాగతం పలికారు.

అనంతరం గర్నవర్‌ను ఆలయ అధికారులు ఘనంగా సత్కరించి, తీర్థ ప్రసాదాలు అందజేశారు. కరోనా టీకా మనదేశంలో తయారు అవ్వడం గొప్ప విషయమని తమిళిసై ఈ సందర్భంగా పేర్కొన్నారు. ప్రతి ఫ్రంట్ లైన్ వారియర్ తప్పకుండా వ్యాక్సిన్ తీసుకోవాలని కోరారు.

వ్యాక్సినేషన్లో ప్రజలందరికీ రక్షణ ఏర్పడుతుందని అన్నారు. ప్రతి ఒక్కరు కరోనా వ్యాక్సిన్ తీసుకొని ఆరోగ్యంగా ఉండాలన్నారు తమిళి సై.

Tags

Read MoreRead Less
Next Story