తెలంగాణ సరిహద్దుల్లోని పెట్రోల్ బంక్‌లకు క్యూ కడుతున్న ఏపీ వాహనాలు

తెలంగాణ సరిహద్దుల్లోని పెట్రోల్ బంక్‌లకు క్యూ కడుతున్న ఏపీ వాహనాలు
నాలుగు చోట్ల ధర తెలుసుకోండి. తక్కువ ఉన్న చోటే కొనుక్కోండి. ఇది లలితా జ్యూయలర్స్ యాడ్. తెలంగాణ సరిహద్దుల్లోని పెట్రోల్ బంక్ యజమానులు దీన్నే ఫాలో అయిపోతున్నారు

నాలుగు చోట్ల ధర తెలుసుకోండి. తక్కువ ఉన్న చోటే కొనుక్కోండి. ఇది లలితా జ్యూయలర్స్ యాడ్. తెలంగాణ సరిహద్దుల్లోని పెట్రోల్ బంక్ యజమానులు దీన్నే ఫాలో అయిపోతున్నారు. పెద్ద పెద్ద హోర్డింగ్స్ పెట్టి మరీ తమ దగ్గర ధర తక్కువని ప్రకటనలు ఇస్తున్నారు. ఏపీలో పోలిస్తే తెలంగాణలో పెట్రోల్ అయినా, డీజిల్ అయినా లీటరుకు కనీసం 3 రూపాయలు ఆదా అవుతుందంటూ చెప్తున్నారు. నిజానికి వాస్తవ పరిస్థితి కూడా ఇలాగే ఉండడంతో వాహనదారులు ఆగి ఏపీలోకి ఎంటరయ్యే ముందే చెక్‌పోస్టుకు దగ్గర్లో ఉన్న బంకుల్లో ఆయిల్‌ కొట్టించుకుంటున్నారు. ఇది వీళ్లకు కాసులు కురిపిస్తుంటే అవతల పక్కల బంకుల వాళ్లు బిజినెస్ లేక దిక్కులు చూడాల్సిన పరిస్థితి.

ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు ఎటు చూసినా బాదుడే. ఈ పన్నుపోటుకు జనం బెంబేలెత్తిపోతున్నారు. ఏపీలో మద్యం ధరలు చాలా ఎక్కువగా ఉండడంతో సరిహద్దుల్లో మందుబాబులు తెలంగాణకు వచ్చి రెండు పెగ్గులేసి వెళ్తున్నారు. కొందరు రిస్కు తీసుకుని మరీ అక్రమంగా మద్యం పట్టుకెళ్తున్నారు. పెట్రోల్ విషయంలోనూ ఇలాగే జరుగుతోంది. చాలా నెలలుగా ఏపీలోకి ఎంటరయ్యే వాహనాలకు ముందే డీజిల్, పెట్రోల్ కొట్టిస్తున్నారు. వంద రూపాయలు మిగిలినా మిగిలినట్టే కదా అంటూ తెలంగాణ సరిహద్దు బంకులకే ఓటు వేస్తున్నారు.

బైక్‌లు, కార్ల కంటే ముఖ్యంగా లారీలు తెలంగాణ బోర్డర్‌ బంకులకు క్యూ కడుతున్నాయి. లీటర్‌పై 3 రూపాయలు మిగులుతుండటంతో డబ్బు ఆదా అవుతుందని వాహనదారులు బంకుల వద్ద బారులుతీరుతున్నారు. ఆంధ్రాలో పెట్రోల్ కొట్టించాలంటే జనం భయపడడానికి అక్కడి రేట్లే కారణం. పథకాల పేరుతో ఓ చేత్తో ఇచ్చినట్టే ఇచ్చి, మరో చేత్తో పన్నుల రూపంలో లాగేసుకుంటున్నారు. ఆటోవాలాలకు వాహనమిత్ర పేరుతో డబ్బులు ఇచ్చి ఇటు పెట్రోల్ రేట్లు పెంచి అదంతా లాగేసుకుంటున్నారని ఇప్పటికే విమర్శలు ఉన్నాయి. పథకాల అమలుకు డబ్బుల కోసం ఇలా అడ్డగోలుగా ట్యాక్స్‌లు వేస్తే ఎలాగని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


Tags

Read MoreRead Less
Next Story