తెలుగు రాష్ట్రాల సీఎంలు ఆదివారం డిల్లీ వెళ్లనున్నట్టు సమాచారం. తీవ్రవాద నిరోధంపై కేంద్ర హోం శాఖ సమావేశాన్ని నిర్వహిస్తోంది. ఈ సమావేశానికి ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ వరద పరిహారం విషయమై కూడా కేంద్ర మంత్రులతో చర్చించే అవకాశమున్నట్టు తెలుస్తోంది. ఈ పర్యటనలో కాంగ్రెస్ అగ్రనేతలను కూడా సీఎం రేవంత్ కలిసే అవకాశం ఉంది. తీవ్రవాద నిరోధంపై అన్ని రాష్ట్రాల సీఎంలతో కేంద్ర హోం శాఖ నిర్వహించే సమావేశానికి వీరివురు హాజరు కానున్నారు. మరోవైపు వరద పరిహారం విషయమై సీఎం రేవంత్ కేంద్ర మంత్రులను కలిసే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పర్యటనలోనే కాంగ్రెస్ అగ్రనేతలను సీఎం రేవంత్ కలవొచ్చని అధికార వర్గాలు పేర్కొన్నాయి. మంత్రివర్గ విస్తరణ అంశంపై అధిష్టానంతో క్లారిటీ తీసుకుంటారని తెలుస్తోంది. సోమవారం జరిగే కేంద్ర హోంశాఖ సమావేశానికి హాజరై, తిరిగి మంగళవారం హైదరాబాద్ చేరుకోనున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com