BAKRID: ముస్లింలకు ప్రముఖుల బక్రీద్‌ శుభాకాంక్షలు

BAKRID: ముస్లింలకు ప్రముఖుల బక్రీద్‌ శుభాకాంక్షలు
X
త్యాగనిరతిని వ్యాప్తి చేయాలన్న చంద్రబాబు....దేవుని పై విశ్వాసంతో సన్మార్గంలో జీవనం సాగించాలన్న రేవంత్‌రెడ్డి

తెలుగుదేశం అధినేత సీఎం చంద్రబాబు, ముస్లింలకు బక్రీద్ శూభాకాంక్షలు తెలిపారు. స్వార్థం, అసూయ, రాగద్వేషాలను విడిచిపెట్టి మానవుల్లో త్యాగనిరతిని వ్యాపింపచేయడమే బక్రీద్ పండుగ ముఖ్యఉద్దేశమన్నారు. పండుగ సందర్భంగా ఖుర్బానీ ద్వారా పేదలకు ఆహారం వితరణగా ఇస్తారన్నారు. త్యాగగుణాన్ని ప్రబోధించే బక్రీద్ పండుగని స్ఫూర్తిగా తీసుకుని సమైక్యతను, సమానత్వాన్ని సాధిద్దామని పిలుపునిచ్చారు.


విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ , ముస్లింలకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. సమాజంలో త్యాగ నిరతిని పెంపొందించడమే బక్రీద్ పండుగ ఉద్దేశమని అన్నారు. ఇస్లాంలో త్యాగం, దానగుణాలకు ప్రత్యేకమైన స్థానముందన్నారు. ప్రవక్త ఇబ్రహీం మహోన్నత త్యాగాన్ని స్మరించుకుంటూ జరుపుకునే పండుగ ఈద్ అల్ అదా సమాన భావన పెంపొందిస్తుందని పేర్కొన్నారు.

త్యాగానికి ప్రతీకగా జరుపుకునే బక్రీద్ పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. ఇస్లాం ప్రవక్తల్లో ఒకరైన ఇబ్రహీం అస్సలామ్, అల్లాహ్ ఆజ్ఞను శిరసావహించి తన కుమారుడిని సైతం బలి ఇచ్చేందుకు సిద్ధం కావడాన్ని స్మరిస్తూ ప్రపంచ వ్యాప్తంగా ముస్లింలు సోమవారం ఈ పండుగ జరుపుకుంటున్నారని ఆయన గుర్తు చేశారు. ప్రవక్తల అచంచలమైన దైవ భక్తి, త్యాగ నిరతికి బక్రీద్ పండుగ అద్దం పడుతుందన్నారు. జీవితంలో ఎదురయ్యే సమస్యలకు భయపడకుండా, దేవుని పై విశ్వాసంతో సన్మార్గంలో జీవనం సాగించాలని బక్రీద్ పండుగ మానవాళికి గొప్ప సందేశాన్ని ఇస్తుందన్నారు. తమకు ఉన్న దాంట్లో నుంచే ఇతరులకు పంచిపెట్టడాన్ని మించిన దాతృత్వం మరొకటి లేదనే స్ఫూర్తిని చాటిచెపుతోందని సీఎం అభిప్రాయపడ్డారు..

Tags

Next Story