DELHI: నేడు ఢిల్లీకి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు

DELHI: నేడు ఢిల్లీకి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు
X

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నేడు ఢిల్లీలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. హస్తినలో ప్రచారం కోసం ఏపీ, తెలంగాణ సీఎంలు సైతం వెళ్లనున్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ఢిల్లీ వెళ్లనున్నారు. నేడు, రేపు ఢిల్లీలో తమ పార్టీల కోసం ప్రచారం సాగించనున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఈ రోజు మధ్యాహ్నం 2.30 కి హైదరాబాద్ నుంచి విమానంలో బయలుదేరనున్నారు. ఎన్డీఏ కూటమిలో భాగంగా బీజేపీ తరుపున సాయంత్రం 7 గంటలకు చంద్రబాబు ప్రచారంలో పాల్గొననున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో కాంగ్రెస్ నేతల తరుపున ప్రచారం నిర్వహించనున్నారు. ప్రచారంలో భాగంగా నేడు, రేపు రేవంత్ ఢిల్లీలో పర్యటించనున్నారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వం పిలుపు మేరకు ఈ నెల 2,3 తేదిల్లో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి.

ఢిల్లీ ఎన్నికల్లో పవన్ కల్యాణ్‌తో ప్రచారం?

ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటే లక్ష్యంగా బీజేపీ ముందుకు సాగుతుంది. ఇందులో భాగంగానే.. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చరిష్మాను వాడుకునేందుకు ఆ పార్టీ సిద్ధమైంది. ఢిల్లీ పలు నియోజకవర్గాల్లో తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడుకు చెందిన ఓట్లు భారీ సంఖ్యలో నివసిస్తున్నారు. దీంతో వారి ఓట్లను రాబట్టుకునేందుకు పవన్ ను ఎన్నికల ప్రచారంలోకి దించేందుకు బీజేపీ సిద్ధం అయింది.


Tags

Next Story