AP: విజయవాడలో కదం తొక్కిన తెలుగు మహిళలు

విజయవాడలో తెలుగు మహిళలు కదం తొక్కారు. వంగలపూడి అనితపై సోషల్ మీడియాలో...... అసభ్య పోస్టులు పెడుతున్నారంటూ మహిళలు నిరసన చేశారు. మహిళలు.. ర్యాలీగా వెళ్లి కనకదుర్గమ్మకు కొబ్బరికాయలు కొట్టారు తెలుగు మహిళలు. మహిళల్ని కాపాడాలంటూ అమ్మవారిని మొక్కుకున్నారు. ఇకపై వైసీపీ నేతలు.. మహిళల జోలికి వస్తే ఉపేక్షించబోమని వార్నింగ్ ఇచ్చారు. చెప్పులు చూపిస్తూ భారీ నిరసన ర్యాలీ చేపట్టారు తెలుగుమహిళలు.
సీఎం జగన్, భారతీ రెడ్డిల పైశాచిక ఆనందం రోజు రోజుకూ పెరిగిపోతోందన్నారు తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత. భారతీరెడ్డి పై ఎవరో ఏదో పోస్టు పెడితే రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించిన వాసిరెడ్డి పద్మ ఇప్పుడెక్కడ ఉందని ప్రశ్నించారు. తమపై అసభ్య కథనాలు రాసిన వాడు ధైర్యముంటే ముందుకు రావాలని సవాల్ విసిరారు. సీఎం భార్యపై పోస్టు వస్తేనే పోలీసులు స్పందిస్తారా ? అని ప్రశ్నించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com