Nara Lokesh: 211వ రోజు ప్రారంభమైన యువగళం పాదయాత్ర

Nara Lokesh: 211వ రోజు ప్రారంభమైన యువగళం పాదయాత్ర
ఉత్సాహంగా హాజరైన జనసేన నేతలు.. .!

తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర 211వ రోజు ఉత్సాహంగా సాగుతోంది. కోనసీమ జిల్లా పేరూరు విడిది కేంద్రం నుంచి లోకేష్ పాదయాత్రను ప్రారంభించారు. ముమ్మిడివరం నియోజకవర్గంలోకి నేడు పాదయాత్ర ప్రవేశించనుంది. పాదయాత్రలో భాగంగా ఆక్వా రైతులతో లోకేష్ సమావేశంకానున్నారు. తర్వాత అమలాపురం హైస్కూలు వద్ద B.C. లతో సమావేశం అవుతారు. పేరూరు క్యాంపు సైట్ వద్ద లోకేష్ ను కలిసి కొందరు వైకాపా నేతలు తెదేపాలో చేరారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గానికి చెందిన ఏలేశ్వరం M.P.P. గొల్లపల్లి నరసింహమూర్తి, రౌతులపూడి M.P.P. గంటిమళ్ల రాజ్యలక్ష్మీ, భద్రవరం M.P.T.C. కొప్పుల బాబ్జీ, తూర్పులక్ష్మీపురం సర్పంచ్ వీరంరెడ్డి సత్యనాగభార్గవి లోకేష్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు.

చంద్రబాబు అరెస్ట్‌ అయిన తర్వాత అన్ని వర్గాల ప్రజలు ఆయనకు అండగా నిలిచారన్నారు. ఆయన్ను జైలుకు పంపితే తన పాదయాత్ర ఆగుతుందని అధికార పార్టీ నేతలు అనుకున్నారని.. ఎన్ని అడ్డంకులు కలిగించినా యువగళం ఆగదన్నారు. వ్యవస్థలను మేనేజ్‌ చేసి చంద్రబాబును 53 రోజులు జైల్లో పెట్టారని.. తనపైనా సీఐడీ అధికారులు కేసులు నమోదు చేసిందన్నారు. కానీ ఈ కేసుల్లో ఒక్క ఆధారమూ చూపలేకపోయారని.. ఏ తప్పూ చేయనందునే మళ్లీ ఇక్కడ నిలబడ్డానన్నారు.

పాదయాత్ర మొదలుపెట్టిన మొదటి రోజు నుంచే తనపై కుట్రలు చేశారని.. అడ్డుకునే ప్రయత్నం జరిగిందన్నారు. పోలీసుల్ని పంపారని, పిల్ల సైకోలను పంపినా వెనక్కు తగ్గలేదన్నారు. తన మైక్, స్టూల్ లాక్కున్నారని.. ఎన్టీఆర్ ఇచ్చిన గొంతు ఆపే మగాడు పుట్టలేదని.. సాగనిస్తే పాదయాత్ర.. అడ్డుకుంటే దండయాత్ర అవుతుందన్నారు. యువగళం వాలంటీర్ల మీద కేసులు పెట్టారని.. నేతల మీద కేసులు పెట్టారన్నారు. చంద్రబాబును చూస్తే జగన్‌కు భయమని.. అందుకే అక్రమంగా అరెస్ట్ చేశారని ఆరోపించారు. మూడు నెలలు ఓపిక పడితే టీడీపీ కార్యకర్తల్ని వేధించిన వారికి వడ్డీ తో సహా చెల్లిస్తానన్నారు. రాజోలు లో ఉన్నా రష్యా పారిపోయినా వెనక్కు తీసుకొచ్చి జైలుకు పంపండ ఖాయమన్నారు.

మరోమూడు నెలల్లో టీడీపీ అధికారంలోకి రావడం పక్కా అంటున్నారు లోకేష్. కచ్చితంగా ఈ వేధింపులకు బదులు తీర్చుకుంటామన్నారు. రాజారెడ్డి రాజ్యాంగం పనైపోయిందని.. అంబేద్కర్ రాజ్యాంగం కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. 80 ఏళ్ల కార్యకర్త కూడా బెదిరింపులకు భయపడకుండా తొడకొట్టి సవాల్ చేస్తారని.. అది టీడీపీ పవర్ అన్నారు లోకేష్.

Tags

Read MoreRead Less
Next Story