గీతం యూనివర్శటిలో ఉద్రిక్తత

గీతం యూనివర్శటిలో ఉద్రిక్తత
విశాఖ గీతం యూనివర్శటిలో మరోసారి ఉద్రిక్తత తలెత్తింది. అర్థరాత్రి దాటకా యూనివర్శిటిలోకి పెద్దసంఖ్యలో పోలీసులు, రెవెన్యూ

విశాఖ గీతం యూనివర్శటిలో మరోసారి ఉద్రిక్తత తలెత్తింది. అర్థరాత్రి దాటకా.... యూనివర్శిటిలోకి.. పెద్దసంఖ్యలో పోలీసులు, రెవెన్యూ అధికారులు చేరుకున్నారు. యంత్రాలు, కంచె సామగ్రితో సిద్ధం కావాలంటూ అర్థరాత్రి దాటాక పోలీసులు రెవెన్యూ అధికారులకు అత్యవసర ఆదేశాలు రావడంతో..హుటాహుటిన ఇక్కడికి చేరుకున్నట్లు తెలుస్తోంది. జేసీబీ, డ్రిల్లింగ్ మెషిన్లతో వచ్చారు. దాదాపు 200 మంది పోలీసు, రెవెన్యూ సిబ్బందితో పాటు... మరో వంద మందికి పైగా కార్మికులు యూనివర్శిటిలోకి వెళ్లారు. గీతం సెక్యూరిటీ, సిబ్బంది దగ్గర నుంచి సెల్ ఫోన్ లు లాక్కున్న పోలీసులు..... మీడియాపైన పోలీసుల ఆంక్షలు విధించారు. ఎండాడ జంక్షన్ వద్దే మీడియాను ఆపేశారు. ప్రస్తుతం డెంటల్ కాలేజి ఎదుట మార్కింగ్, డ్రిల్లింగ్ చేస్తున్నారు అధికారులు. సర్వే పోల్స్ పాతి ఫెన్సింగ్ వేస్తున్నారు. గతంలోనూ గీతం యూనివర్శిటి విషయంలో.. జగన్ సర్కారు ఇలాగే వ్యవహరించింది.

Tags

Read MoreRead Less
Next Story