AP: నంద్యాల విజయ డెయిరీ వద్ద ఉద్రిక్తత

నంద్యాల విజయ పాల డెయిరీ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. డెయిరీ సొసైటీ అధ్యక్షుడిగా ఉన్న భూమా విఖ్యాత్ రెడ్డిని ఇటీవల పాలకవర్గం తొలగించి సస్పెన్షన్ వేటు వేసింది. దీంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. పాలక వర్గం విధించిన అనర్థత వేటును సస్పెండ్ చేయాలని కోరారు. దీంతో నంద్యాలలో ఆ రోజు నుంచి డెయిరీ పాలక వర్గం వర్సెస్ విఖ్యాత్ రెడ్డిగా పరిస్థితి మారిపోయింది. డెయిరీలో మూడు డైరెక్టర్ పదవులు ఖాళీ అయ్యాయి. ఈ మేరకు డెయిరీకి డైరెక్టర్లను ఎన్నుకునేందుకు తాజాగా నామినేషన్లను స్వీకరిస్తున్నారు. దీంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. నామినేషన్లు అడ్డుకునేందుకు విజయ పాల డెయిరీ వద్దకు భూమా అనుచరులు భారీగా చేరుకున్నారు. అప్రమత్తమైన పోలీసులు డెయిరీ వద్ద భారీగా మోహరించారు. విఖ్యాత్ రెడ్డి అనుచరులను అడ్డుకున్నారు. డెయిరీ వద్దకు ఇతరులు వచ్చేందుకు అనుమతి లేదని హెచ్చరించారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
విమర్శలు-ఆరోపణలు
జగత్ డెయిరీ వర్కింగ్ పార్ట్‌నర్‌గా భూమా విఖ్యాత్ ఉంటూ విజయడెయిరీ ద్వారా రూ.1.30 కోట్లు రుణం తీసుకొని పలుమార్లు నోటీసులు పంపినా అప్పు చెల్లించలేదన్న విమర్శలు ఉన్నాయి. 2014–2020 వరకు జగత్ పాల డెయిరీని విజయ డెయిరీకి సమానంగా నడిపారని.. ఆ సమయంలో 30% వ్యాపారం విజయ డెయిరీకి నష్టం వచ్చిందన్న ఆరోపణలు కూడా వచ్చాయి. వీటిని విఖ్యాత్ ఖండించారు. తనపై అనవసర.. అసత్య ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. అఖలప్రియ వర్సెస్ జగన్ అన్నట్లు రాజకీయాలు నడుస్తున్నాయి. తాజాగా నంద్యాల విజయ పాల డైరీ వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. యత్నంచారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com