Punganur: వైకాపా ఎంపీ మిథున్‌రెడ్డి పర్యటన నేపధ్యంలో పుంగనూరులో ఉద్రిక్తత

Punganur: వైకాపా ఎంపీ మిథున్‌రెడ్డి పర్యటన నేపధ్యంలో పుంగనూరులో ఉద్రిక్తత
X
మిథున్‌రెడ్డి పర్యటనను నిరసిస్తూ ఎన్డీయే కార్యకర్తల నిరసన ర్యాలీ

చిత్తూరు జిల్లా పుంగనూరులో ఉద్రిక్తత చోటుచేసుకుంది. వైకాపా, ఎన్డీయే కార్యకర్తల మధ్య రాళ్లదాడి జరిగింది. వైకాపా ఎంపీ మిథున్‌రెడ్డి పర్యటన నేపథ్యంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ పార్టీ మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంటికి మిధున్‌రెడ్డి వెళ్లారు. వైకాపా ప్రభుత్వ హయాంలో ఎంపీ వేధింపులకు గురిచేశారంటూ ఎన్డీయే కార్యకర్తలు రెడ్డప్ప ఇంటి వద్దకు చేరుకున్నారు.

ఈ క్రమంలో వైకాపా కార్యకర్తలు.. తెదేపా, జనసేన, భాజపా కార్యకర్తలపై రాళ్లతో దాడి చేశారు. దీంతో కూటమి కార్యకర్తలు ప్రతిఘటించారు. తిరిగి వైకాపా కార్యకర్తలపై రాళ్లు విసిరారు. ‘మిథున్‌రెడ్డి గో బ్యాక్‌’ అంటూ నినాదాలు చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. ఆందోళనకారులను చెదరగొట్టి ఇరువర్గాలను అదుపులోకి తీసుకొచ్చేందుకు యత్నించారు. అనంతరం ఎంపీని పోలీసులు గృహనిర్బంధం చేశారు.

Tags

Next Story