శ్రీకాకుళంలో ఉద్రిక్తత.. పరిహారం ఇవ్వకుండా భూములు లాగేసుకున్నారు..

శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళo మండలం రాగోలు పంచాయితీ వాకలవలసలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. జగనన్న అర్బన్ లే అవుట్ కోసం అధికారులు సేకరించిన స్థలం విషయంలో వివాదం ఏర్పడింది. స్థలాన్ని చదును చేసేందుకు వెళ్లిన అధికారులను పలువురు స్థానికులు అడ్డుకున్నారు.
JCB పైకి ఎక్కి మహిళలు పనులను అడ్డుకున్నారు. అయితే తమకు పరిహారం ఇవ్వకుండా తమ పొలాలను అధికారులు స్వాధీనం చేసుకుంటున్నారంటు ఆందోళన చేస్తున్నారు. దీంతో స్థానికులను పోలీసులు అడ్డుకున్నారు. సర్వే నెంబర్ 169 లోని 39.64 ఎకరాలలో 2ఎకరాల 50 సెంట్ల భూమి విషయమై వివాదం తలెత్తింది. ఆందోళన చేస్తున్నవారు అసలు పట్టాదారు నుంచి భూమిని కొనుగోలు చేసినవారని అధికారులు వెల్లడిస్తున్నారు. అయితే ల్యాండ్ సీలింగ్ భూములు కావడంతో అసలు పట్టాదారునికి పరిహారం అందజేశామంటున్నారు అధికారులు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com