AP: తునిలో హై టెన్షన్..పోలీసుల లాఠీఛార్జ్

తుని మున్సిపల్ వైస్ ఛైర్మన్ ఎంపికలో ఉద్రిక్తతత కొనసాగుతోంది. తుని మున్సిపల్ కార్యాలయంలో వైస్ ఛైర్మన్ ఎంపిక వేళ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బారీకేడ్లు ఏర్పాటు చేశారు. అయితే బారీకేడ్లు దాటుకుని కార్యాలయం వైపు కార్యకర్తలు దూసుకొచ్చారు. గుంపులు గుంపులుగా కార్యాలయం వైపు దూసుకెళ్లడంతో పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. ఇప్పటికే టీడీపీ మున్సిపల్ కౌన్సిలర్లు కార్యాలయానికి వచ్చారు. తమ కౌన్సిలర్లను వైసీపీ నేతలు అడ్డుకుంటున్నారని టీడీపీ కౌన్సిలర్లు ఆరోపిస్తున్నారు.
ముద్రగడను రోడ్డుపైనే నిలిపేసిన పోలీసులు
మాజీమంత్రి ముద్రగడ పద్మనాభం వాహనాన్ని తునిలో పోలీసులు నిలిపివేశారు. తుని పట్టణంలో జరుగుతున్న మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక నేపథ్యంలో మాజీమంత్రి దాడిశెట్టి రాజా ఛలో తుని కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో తుని చేరుకుంటున్న వైసీపీ నేతలను పోలీసులు అడ్డుకుంటున్నారు. అందులో భాగంగా ముద్రగడ పద్మనాభం, ఆయన తనయుడు, వైసీపీ కోఆర్డినేటర్ గిరి వాహనాన్ని కూడా పోలీసులు తునిలో నిలిపివేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com